»   » వరుణ్‌ సందేశ్‌ ఖండన.. కానీ కాబోయే భార్య

వరుణ్‌ సందేశ్‌ ఖండన.. కానీ కాబోయే భార్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న యువ హీరో వరుణ్ సందేశ్ పై ఓ వార్త మీడియాలో జోరుగా షికారు చేస్తోంది. ఈ యువ నటుడికి డెంగ్యూ సోకిందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వరుణ్ సందేస్ స్పందిచాడు.

తాను కేవలం జనరల్ చెకప్ కోసమే మంగళవారం యశోదా ఆస్పత్రికి వెళ్లానని, అక్కడ తనను చూసిన కొందరు ఈ విధంగా రూమర్స్ క్రియేట్ చేశారని వరుణ్ వాపోయాడు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని, త్వరలోనే తన ప్రియురాలు వితికతో నిశ్చితార్ధం జరగబోతోందని చెప్పాడు .

అయితే వరుణ్‌ సందేశ్‌ టైఫాయిడ్‌, డెంగీతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనకు కాబోయే సతీమణి వితిక తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. దాంతో ఏది నిజమో..ఏది అబద్దమో తెలియని సిట్యువేషన్ ఏర్పడింది. ఆ ట్వీట్ మరో సారి చూడండి.

తనకు కాబోయే భర్త టైఫాయిడ్‌, డెంగీతో బాధపడుతున్నారని, ఈ నెల 7న తమ నిశ్చితార్థంనాటికి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా అభిమానులు సైతం ప్రార్థించాలని ట్వీట్‌ చేశారు.

మోడల్‌, నటి వితికతో ఈ నెల 7న తన నిశ్చితార్థం జరగనున్నట్లు వరుణ్‌ సందేశ్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary
Varun Sandesh denies Dengue Fever Rumors.
Please Wait while comments are loading...