»   » హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న వరుణ్ సందేశ్

హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న వరుణ్ సందేశ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ వరుణ్ సందేశ్. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా వరుణ్ సందేశ్ కి సరైన హిట్టు మాత్రం లేదు. దీంతో సినిమా అవకాశాలు కూడా చాలా వరకు తగ్గాయి. ఆ సంగతి పక్కన పెడితే త్వరలో వరణ్ సందేశ్ పెళ్లి చేసుకోవడానికి సిద్దమవుతున్నాడు.

తనతో పాటు ‘పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంలో నటించిన వితికా షేరుతో ప్రేమ వ్యవహారం నడుపుతున్న వరుణ్ సందేశ్ ఆమెను పెళ్లాడేందుకు రెడీ అయ్యాడు. ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారం విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించారని తెలుస్తోంది. త్వరలోనే నిశ్చితార్థం, పెళ్లి విషయమై ప్రకటన రానుంది.

 Varun Sandesh is ready to get married with Vithika

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్' చిత్రం భారీ విజయం సాధించడంతో వరుణ్ సందేశ్ మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘కొత్త బంగారు లోకం' కూడా హిట్ కావడంతో వరుణ్ కి అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్ చేసిన సినిమాలన్నీ దాదాపుగా పరాజయం పాలయ్యాయి.

పెళ్లి తర్వాత అయినా వరుణ్ సందేశ్‌కి లక్కు కలిసొస్తుందో? లేదో? వెయిట్ అండ్ సీ....

English summary
Tollywood lover boy Varun Sandesh is ready to get married with Vithika. Recently Varun Sandesh revealed that he will get married but with whom he did not reveled, only he informed that his girl friend belongs to the film industry.
Please Wait while comments are loading...