»   » వరుణ్ సందేశ్ కు ప్రమాదం..గాయాలు

వరుణ్ సందేశ్ కు ప్రమాదం..గాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రొమాంటిక్ హీరో వరుణ్ సందేశ్ షూటింగ్ లో రోప్ వే తెగి పడటంతో గాయాలయ్యాయి. శ్రావణ్ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గచ్చీబౌలీలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో జరుపుకుంటోంది. అయితే ఫైటింగ్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. రోప్ వే తెగిపోవడంతో.. వరుణ్ కిందపడ్డాడు. దీంతో తన రెండు చేతులకు గాయాలయ్యాయి. వెంటనే వరుణ్ సందేశ్ ను దగ్గర్లోని ఇమేజ్ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఇవేమీ పెద్ద గాయాలేవీ కావని సినిమా యూనిట్ అంటున్నారు. మరోవైపు ప్రథమ చికిత్స అనంతరం.. వరుణ్ సందేశ్ డిశ్చార్జీ చేసి ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. యుకె ఎవెన్యుస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై పి. ఉదయ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అమృతా రావు సోదరి ప్రీతికా రావు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

English summary
Varun Sandesh met with an accident today. This accident was happened while shooting at Gacchi bowl Engineering College.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu