»   » అందుకే వరుణ్ సందేశ్ ఎప్పూడూ 'జిల్.. జిల్.. జిగా'

అందుకే వరుణ్ సందేశ్ ఎప్పూడూ 'జిల్.. జిల్.. జిగా'

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుణ్ సందేష్ కెరీర్ ని చూస్తుంటే...భలే లక్కీ ఫెలో అనిపిస్తుంది. వరసగా సినిమాలు ప్లాపు అవుతున్నా కొత్తగా ప్రారంభమయ్యే చిత్రాలకు మాత్రం లోటు లేదు. తాజాగా కాగా వరుణ్ శ్రవణ్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయటానికి అంగీకరించాడు. గతంలో బ్లాక్ అండ్ వైట్ అనే సినిమాని రోపొందించిన ఉదయ్ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నవంబరులో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి 'జిల్..జిల్..జిగా' అనే టైటిల్ ని పరిశిలిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఓ నెల క్రిందట రిలీజైన 'హ్యాపీ హ్యాపీగా' చిత్రం పరాజయం పాలైంది. ప్రస్తుతం వరుణ్ సందేశ్ సంపత నంది దర్శకత్వంలో రాధామోహన్ నిర్మిస్తున్న 'ఏమైంది ఈ వేళ' చిత్రంతో పాటు 'కుదేరితే కప్పు కాఫీ' అనే సినిమాలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి రామనసేల్వ దర్శకుడు. ఇక వరుణ్ సందేశ్ కి ఇంత క్రేజ్ కి కారణం హ్యాపీడేస్, కొత్త బంగారులోకం కారణాలైతే అస్సలు కారణం యంగ్ హీరోల కొరతేనని ఇండస్ట్రీలో అంటున్నారు. ఉదయ్ కిరణ్, తరుణ్ ల స్లాట్ ని వరుణ్ సందేశ్ ఫిలిప్ చేస్తున్నాడని చెప్తున్నారు. అలాగే పెద్ద హీరోల డేట్స్ దొరకని వారు, ప్రేమ కథలు చేద్దామనుకనేవారు, కొత్త హీరోతో చేయటం కన్నా వరుణ్ సందేశ్ ని తీసుకోవటం బెటరని భావించటమే కారణం అని తేలుస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu