»   » వరుణ్ సందేశ్ కొత్త చిత్రం 'హ్యాపీ హ్యాపీగా'

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం 'హ్యాపీ హ్యాపీగా'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హ్యాపీ డేస్ తో పరిచయమైన వరుణ్ సందేశ్ తాజాగా హ్యాపీ హ్యాపీగా...అనే చిత్రంలో నటిస్తున్నారు. సైలెంట్ గా షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం జూన్ లో రిలీజ్ కు రెడీ అయింది. ఈ చిత్రం ద్వారా ప్రియా శరణ్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. ప్రియాశరణ్ గతంలో ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణు వర్దన్(భిళ్లా), ఎమ్.రాజా (హనుమాన్ జంక్షన్)ల వద్ద అసెస్టెంట్ గా పనిచేసారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా సరోజ చిత్రం లో చేసిన వేగ, శరణ్యా మోహన్ నటిస్తున్నారు. ఓషన్ ఫిల్మ్స్ అనే నూతన నిర్మాణ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రంజిత్ మూవిసా వారు సమర్పిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu