»   » వరుణ్ సందేశ్ కు డెంగ్యూ ఫీవర్ ...నిజమే

వరుణ్ సందేశ్ కు డెంగ్యూ ఫీవర్ ...నిజమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ నెల (డిసెంబర్) 7వ తేదీన తన నిశ్చితార్ధం అంటూ ప్రకటించిన వరుణ్ సందేష్ ఈలోగా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. టైఫాయిడ్ , డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న వరుణ్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని వరుణ్ పెళ్లాడబోతున్న వితికా షేరు స్వయంగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

'నాకు కాబోయే భర్త వరుణ్ సందేశ్ టైఫాయిడ్, డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. డిసెంబర్ 7 నిశ్చితార్ధం నాటికి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నా.. మీరు కూడా వరుణ్ కోసం ప్రార్థించండి' అంటూ ట్వీట్ చేసింది.

వరుణ్ సందేశ్ - వితిక షేరుల నిశ్చితార్ధ వేడుక డిసెంబర్ 7న జుబ్లీ హిల్స్ క్లబ్ లో జరగనుంది. ఈ ఎంగేజ్ మెంట్ కోసం ఉదయం 8గంటల 32 నిమిషాల సమయాన్ని ఫిక్స్ చేసారు.

Varun Sandesh suffering from Dengue feaver

పడ్డానండి ప్రేమలో, ఝామ్మంది నాథం, ప్రేమ్ ఇష్క్ కాదల్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ వితికా శేరుగా తో ప్రేమలో పడి అది పెళ్లిదాకా వచ్చింది. పడ్డానండి ప్రేమలో చిత్రం నుంచి వీరిరువురి మధ్య చిగురించింది.

కార్యక్రమానికి సినీ, రాజకీయ వర్గాల ప్రముఖులు, వరుణ్‌సందేశ్‌ బంధుమిత్రులు హాజరవుతారు. వరుణ్‌ సందేశ్‌ ప్రస్తుతం 'మామ మంచు అల్లుడు కంచు'లో నటిస్తున్నాడు.

English summary
Vithika Sheru tweeted: My fiancé iamvarunsandesh is down with TYPHOID and DENGUE!!Hope he gets better by December 7th😕😞 PLS PRAY FOR HIM #hospitalised
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu