»   »  వారం కాకుండానే సక్సెస్ మీట్ అంటూ సొంత డబ్బా

వారం కాకుండానే సక్సెస్ మీట్ అంటూ సొంత డబ్బా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ వారం తెలుగులో విడదలైన రెండు చిత్రాలు...కళ్యాణ్ రామ్ కత్తి, వరణ్ సందేశ్ 'ఏమైంది ఈవేళ'. ఈ రెండు చిత్రాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఈ రెండు చిత్రాల నిర్మాతలు కూడా అప్పుడే సక్సెస్ మీట్ లు నిర్వహించేసారు. ఇక టీవీల్లో అయితే వీరి హంగామాకి హద్దే లేకుండా పోయింది. కళ్యాణ్ రామ్ మీడియావారికి ప్రత్యేక ఇంటర్వూలు ఇచ్చి, ప్రమోషన్ లో పడితే వరుణ్ సందేశ్ కూడా తనుకున్న పరిధిలో తంటాలు పడుతున్నాడు.

ఈ చిత్రాన్నిథియేటర్లలో మూడుసార్లు చూశాను. కథ చెప్పినప్పుడు ఎలాంటి గందరగోళంగా లేకుండా దర్శకుడు చెప్పాడు. తీసేటప్పుడుకూడా అదేవిధంగా తీశారు. ఈ చిత్రం సక్సెస్‌ కు కారణం దర్శకుడు సంపత్ ‌నందే. ముఖ్యంగా తల్లి కొడుకుల సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. యూతే కాకుండా ఫ్యామిలీస్‌ కూడా ఈచిత్రాన్ని చూసి ఆనందించాలని వరుణ్‌ సందేశ్‌ అన్నారు. వరుణ్ సందేశ్ తన తాజా చిత్రం'ఏమైంది ఈవేళ' ప్లాప్ టాక్ తెచ్చుకున్నా ఇలా మీడియా ముందు సొంత డబ్బా ప్రారంభించారు.

ఇక ఈ చిత్రం సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ...కథ సంపత్‌ నంది చెబుతున్నప్పుడే భవిష్యత్‌ లో గొప్ప దర్శకుడు అవుతాడనిపించింది. చక్కటి పంచ్‌ డైలాగ్ ‌లు రాయడంలో జాగ్రత్తలుతీసుకున్నాడు. నటీనటులందరికీ గుర్తింపు పొందేలా తగు చర్యలుతీసుకున్నాడు అన్నాడు. నిర్మాత రాధామోహన్‌ మాట్లాడుతూ.. 'ఏమైంది ఈవేళ' నిలబడిందని, దర్శకుడు సంపత్‌ నంది కథ చెప్పినప్పుడే వరుణ్ ‌సందేశ్‌ కరెక్ట్ ‌గా సరిపోతాని చెప్పాను. దర్శకుడు పక్కాస్క్రిప్ట్‌తో వచ్చారు. అన్ని చోట్ల నుంచి మంచి రిపోర్ట్స్‌ వస్తున్నాయని తెలిపారు.అదీ సంగతి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu