»   » సింగర్ అవతార మెత్తిన వరుణ్‌సందేశ్‌

సింగర్ అవతార మెత్తిన వరుణ్‌సందేశ్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీసెంట్ గా అత్తారింటికి దారేది చిత్రం కోసం పవన్ కళ్యాణ్ ....కాటమరాయుడా అనే పాట పాడి క్రేజ్ తెచ్చారు. ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నారు కుర్ర హీరోలు. వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఈ వర్షం సాక్షిగా' కోసం ఈ యంగ్ హీరో గాయకుడిగా కొత్త అవతారం ఎత్తాడు. భూమ్మీద బ్యూటీ అమ్మాయే... లేడీకి సాటి లేదాయే' అంటూ వరుణ్‌సందేశ్‌ తన గొంతు సవరిస్తూ ఓ పాట అందుకున్నాడు. హాస్యనటులు ధన్‌రాజ్, జై వేణు, సాయికృష్ణ కూడా ఈ పాటలో గొంతు కలిపారు.

ఓ అబ్బాయి తన ప్రేయసి వద్ద తన ప్రేమను ఎంత గొప్పగా వ్యక్తం చేశాడనే ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం 'ఈ వర్షం సాక్షిగా'. "ప్రేమికులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలియజేసే సినిమా ఇది. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ తమ ప్రేమను ఇలా వ్యక్తం చేసుంటే బాగుండేదని అనుకుంటారు'' అని దర్శకుడు చెప్తున్నారు. హరిప్రియను హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాహుల్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై మాస్టర్‌ ప్రీతమ్‌రెడ్డి సమర్పణలో బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి, శ్రీనివాస్‌ చవాకుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమణ మొగిలి దర్శకుడు.

నిర్మాత మాట్లాడుతూ...''చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వరుణ్‌సందేశ్‌, హరిప్రియను టీజింగ్‌ చేస్తూ వచ్చే పాటను వరుణ్‌సందేశ్‌ స్వయంగా ఆలపించాడు. ఆయనకు తోడుగా ధన్‌రాజ్‌, జై వేణు, సాయికృష్ణ కూడా గొంతు కలిపారు. ఈ పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.త్వరలోనే ఆడియోను విడుదల చేస్తాం'' అన్నారు.

 Varun Sandesh Turns Singer For 'Ee Varsham Sakshigaa'

రమణ మొగిలి దర్శకత్వంలో రాహుల్ మూవీమేకర్స్ పతాకంపై మాస్టర్ ప్రీతమ్‌రెడ్డి సమర్పణలో బి.ఓబుల్ సుబ్బారెడ్డి, శ్రీనివాస్ చవాకుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చలపతిరావు, జీవా, శివారెడ్డి, కాశీ విశ్వనాథ్, హేమ, ఢిల్లీ రాజేశ్వరి, ధనరాజ్ తారాగణమైన ఈ చిత్రానికి కథ: ముకుంద్ పాండే, మాటలు: రామస్వామి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, శ్రీమణి, సంగీతం: అనిల్ గోపిరెడ్డి, ఛాయాగ్రహణం: మోహన్‌చంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం. కిశోర్‌కుమార్.

English summary
Recently Varun Sandesh has sung a song for the 'Ee Varsham Saakshigaa' film and the producers have disclosed the details. Producers said 'Varun Sandesh has sung a song for the film that comes as a teasing number and comedians Dhan Raj, Jai Venu and Sai Krishna also joined him. The movie is a mixture of romance and family emotions stuffed in the right amounts to woo all the sections of the crowd. We plan to launch the audio soon and release the film in November...'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu