»   » తిరుమలలో వరుణ్‌ సందేశ్‌ ఉపనయనం

తిరుమలలో వరుణ్‌ సందేశ్‌ ఉపనయనం

Posted By:
Subscribe to Filmibeat Telugu
తిరుమల : వరుణ్‌ సందేశ్‌ తిరుమలలో శనివారం ఉపనయనం నిర్వహించుకున్నారు. పుష్పగిరి మఠంలో బంధుమిత్రుల సమక్షంలో కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరుపుకున్నారు. కార్యక్రమానంతరం శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో పలువురు బుల్లితెర నటులు పాల్గొన్నారు.

ప్రస్తుతం వరుణ్‌సందేశ్, నిషా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా భానుశంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీ కుమారస్వామి ప్రొడక్షన్స్ పతాకంపై పత్తికొండ కుమారస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'సరదాగా అమ్మాయి'తో అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'ప్రేమికుల మధ్య చోటుచేసుకునే సున్నితమైన భావోద్వేగాలకు కుటుంబ అంశాలను జోడించి రూపొందిస్తున్న పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్ ఇది.

ఈ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. టైటిల్‌కు తగిన విధంగా సినిమా అంతా సరదాగా, హాయిగా వుంటుంది. చక్కని కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా అందరూ మెచ్చుకునే విధంగా వుంటుంది' అన్నారు. సుమన్, అలీ, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, ధర్మవరపు సుబ్రమణ్యం, వేణుమాధవ్, ముమైత్‌ఖాన్ తదితరులు ముఖ్యపావూతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రవివర్మ,

వరుణ్ సందేష్ ఈ చిత్రాలతో పాటు 'అబ్బాయి క్లాస్-అమ్మాయి మాస్', డి ఫర్ దోపిడీ తదితర చిత్రాల్లో నటిస్తున్నాడు. 'కోనేటి శ్రీను'ను దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మణ్‌ కేదారి 'అబ్బాయి క్లాస్‌..అమ్మాయి మాస్‌' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హిందీలో '99', 'షోర్ ఇన్ సిటీ' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కెలు 'డి ఫర్ దోడిపి' చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. సిరాజ్ కల్లాన్ని ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

English summary

 Hero Varun Sandesh parents performed his Upanayanam at Tirumala on Saturday. Family members took room on Friday and stayed overnight. On Saturday morning at Pushpagiri Matham Varun Sandesh's threadwearing ceremony was performed. Later Varun had the darshan of the lord along with family members before returing back.
Please Wait while comments are loading...