»   » వరుణ్ సందేశ్-వితిక ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్

వరుణ్ సందేశ్-వితిక ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు నటుడు వరణ్ సందేశ్ త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ‘పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంలో తనకు జోడీగా నటించిన వితికా షేరుతో ప్రేమ వ్యవహారం నడుపుతున్న వరుణ్ సందేశ్ ఆమెను పెళ్లాడేందుకు రెడీ అయ్యాడు. ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారం విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 7న ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్ లోనే పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో నిశ్చితార్థం వేడుక జరుగబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

 Varun Sandesh-Vithika engagement on Dec 7th

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్' చిత్రం భారీ విజయం సాధించడంతో వరుణ్ సందేశ్ మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘కొత్త బంగారు లోకం' కూడా హిట్ కావడంతో వరుణ్ కి అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్ చేసిన సినిమాలన్నీ దాదాపుగా పరాజయం పాలయ్యాయి. పెళ్లి తర్వాత అయినా వరుణ్ సందేశ్‌కి లక్కు కలిసొస్తుందో? లేదో? వెయిట్ అండ్ సీ....

English summary
Varun Sandesh is all set to marry actress Vithika. Their engagement ceremony will be taking place on December 7th in Hyderabad, say Tollywood sources.
Please Wait while comments are loading...