»   » ప్రేమ కథల స్పెషలిస్టు దర్శకత్వంలో వరుణ్ సందేశ్

ప్రేమ కథల స్పెషలిస్టు దర్శకత్వంలో వరుణ్ సందేశ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేమ కథల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కదిర్ చిరకాల విరామం తర్వాత మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు. వరుణ్‌ సందేశ్‌ ని హీరోగా ఎంచుకుని మరో ప్రేమ కావ్యాన్ని తెలుగు తెరపై పండించటానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీమహాగణపతి ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న చిత్రీకరణ మొదలవుతుంది. నిర్మాత, కెమెరామెన్ అయిన ఎమ్‌.సుధాకర్‌ మాట్లాడుతూ..."మా సంస్థ నిర్మించే అయిదో చిత్రమిది. ఎఆర్ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తారు. నటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తామన్నారు.ఇక కదిర్ గతంలో హృదయం, ప్రేమదేశం, ప్రేమికుల రోజు, కాదల్ వైరస్ వంటి చిత్రాలు రూపొందించారు. అలాగే వరుణ్ సందేశ్ హీరోగా తయారైన మరో చరిత్ర చిత్రం రీమేక్ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu