»   » షిర్డీ లో : కాబోయే భార్యతో వరుణ్‌ సందేశ్‌ (ఫొటో)

షిర్డీ లో : కాబోయే భార్యతో వరుణ్‌ సందేశ్‌ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న వరుణ్‌ సందేశ్‌, వితికలు షిర్డీ సాయిబాబాని దర్శించుకున్నారు. దర్శనం చాలా బాగా జరిగిందని, అందరూ సుఖ శాంతులతో వర్థిల్లాలని కోరుకున్నానని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా సాయి సంస్థాన్‌ సిబ్బందితో కలిసి తీసుకున్న ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. నిశ్చితార్థానికి ముందు వరుణ్‌ సందేశ్‌ అనారోగ్యంతో బాధపడిన విషయం తెలిసిందే.

Had an amazing darshanam at #Shirdi :-) May God Bless everyone with lots of happiness n peace!!

Posted by Varun Sandesh on 9 December 2015

టాలీవుడ్ హీరో వరణ్ సందేశ్, హీరోయిన్ వితికా షేరు ఎంగేజ్మెంట్ సోమవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు. వరుణ్, వితికాలతో దిగిన ఫోటోలను నవీన్ చంద్ర, నిఖితా నారాయణ్ తదితరులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.

‘పడ్డానండీ ప్రేమలో మరి' చిత్రంలో తనకు జోడీగా నటించిన వితికా షేరుతో వరుణ్ సందేశ్ కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత కొంత కాలంగా ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారం విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్' చిత్రం భారీ విజయం సాధించడంతో వరుణ్ సందేశ్ మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘కొత్త బంగారు లోకం' కూడా హిట్ కావడంతో వరుణ్ కి అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్ చేసిన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద బొల్తా పడటంతో కెరీర్ కాస్త స్లో అయింది. పెళ్లి తర్వాత తనకు కెరీర్ పరంగా కలిస్తుందని వరుణ్ సందేశ్‌ భావిస్తున్నారట.

English summary
Varun Sandesh shared in FB :" Had an amazing darshanam at ‪#‎Shirdi‬ May God Bless everyone with lots of happiness n peace!!"
Please Wait while comments are loading...