»   » నిన్నటి దాకా పవన్...ఇప్పుడు ఎన్టీఆర్

నిన్నటి దాకా పవన్...ఇప్పుడు ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఒక్కోసారి ఒక్కో సీజన్ నడుస్తుంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ చిత్రంలోని హిట్ పాటలనుంచి తీసుకుని టైటిల్స్ పెడుతూండటం బాగా పెరిగింది. ఆ రకంగా తమ ప్రాజెక్టుకు క్రేజ్ తేవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ ది మొదలైంది. ఆ చిత్రంలోని పాటలపైన దృష్టి పెట్టారు. తాజాగా వరుణ్ సందేశ్ చిత్రానికి 'పడ్డానండీ ప్రేమలోమరి' అనే టైటిల్ ని పెట్టి సినిమా ప్రారంభించారు. ఈ పాట...ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలోనిది. ఈ స్పూర్తిగా ఇంకా ఎంతమంది ఎన్టీఆర్ చిత్రాలలోని పాటలపై దృష్టి పెడతారో చూడాలి.

వరుణ్‌ సందేశ్‌, వితిక శేరు జంటగా రూపొందుతున్న చిత్రం 'పడ్డానండీ ప్రేమలోమరి'. మహేష్‌ ఉప్పుటూరి దర్శకత్వం వహిస్తున్నారు. నల్లపాటి రామచంద్రప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత ఎమ్‌.వి.ఎస్‌.హరనాథరావు క్లాప్‌నిచ్చారు. నిర్మాత పోకూరి బాబురావు గౌరవ దర్శకత్వం వహించారు.

Varun Sandhesh’s next tilted ‘Paddanandi Premalomari’

దర్శకుడు మాట్లాడుతూ ''ప్రేమ, కుటుంబ సంబంధాలు కలగలిపిన కథ ఇది. ఆద్యంతం నవ్విస్తూ.. చివర్లో చక్కటి సందేశాన్నిచ్చేలా ఉంటుంది'' అన్నారు. ''నేటితరం యువతకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. వినోదానికి ప్రాధాన్యముంటుంది'' అన్నారు నిర్మాత. ఈ చిత్రంలో అరవింద్‌, తాగుబోతు రమేష్‌, ఎమ్మెస్‌ నారాయణ, తెలంగాణ శకుంతల, రక్ష, కాశీవిశ్వనాథ్‌ తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి ఛాయాగ్రహణం: భరణి కె.ధరణ్‌, సంగీతం: ఎ.ఆర్‌.ఖద్దూస్‌, కూర్పు: ప్రవీణ్‌ పూడి, కళ: కుమార్‌

English summary
Varun Sandhesh new film which began its shooting is titled ‘Paddanandi Premalomari’. Vithika Sheru is cast opposite Varun Sandhesh as the heroine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu