For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాళ్ల సినిమాలు కూడా స్లోగానే, ప్రేక్షకుడి తీర్పు అంగీకరిస్తున్నాం: ‘అంతరిక్షం’పై వరుణ్ తేజ్

  |

  వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'అంతరిక్షం' చిత్రం ఈ నెల 21న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పంద వస్తోంది. బాక్సాఫీసు వద్ద 3 డేస్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 9.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో రూ. 3.70 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైనట్లు తెలుస్తోంది.

  సోమవారం 'అంతరిక్షం' చిత్ర బృందం మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ... ప్రేక్షకుల తీర్పును యాక్సెప్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ముందు మరింత బెటర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపారు.

  మా సినిమానే కాదు.. అన్నీ స్లోగానే మొదలయ్యాయి

  మా సినిమానే కాదు.. అన్నీ స్లోగానే మొదలయ్యాయి

  ‘అంతరిక్షం' ఈ నెల 21న విడుదలైంది. వాస్తవానికి ఈరోజు మా సినిమాతో పాటు చాలా సినిమాలు వచ్చాయి. హిందీ, తెలుగులో చాలా విడుదలయ్యాయి. కలెక్షన్స్ వైజ్ చూసుకుంటే అన్ని సినిమాలు చాలా స్లోగా మొదలయ్యాయని వరుణ్ తేజ్ వ్యాఖ్యానించారు.

   సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్

  సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్

  మా సినిమా చూసిన వారంతా చాలా మంచి అప్లాజ్ ఇచ్చారు. మా అందరినీ బాగా అప్రిషియేట్ చేశారు. ముందుగా ప్రేక్షకులకు థాంక్స్. ఇంలాంటి సినిమాను వారు యాక్సెప్ట్ చేయడం చాలా పెద్ద విషయం. వారు అర్థం చేసుకుని మా సినిమాను లవ్ చేసి అభినందించారు. మీడియా వారు కూడా మొదటి నుంచి బాగా ప్రమోట్ చేసి హెల్ప్ చేశారు. అందరికీ థాంక్స్.

  అందుకే నాన్నకు కోపం వచ్చింది: నాగబాబు-బాలయ్య వివాదంపై వరుణ్ తేజ్!

  వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం

  వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం

  ఒక సినిమా చేయాలంటే అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ఒక మంచి ప్రొడక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అంతరిక్షం విషయంలోనూ అదే చేశాం. సినిమా ఫలితంపై హ్యాపీగా ఉన్నాం. అయితే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ప్రతి సినిమాకు ప్రశంసలు, విమర్శలు ఉంటాయి. ఈ సినిమా విషయంలో మేము వాటిని యాక్టెప్ట్ చేస్తున్నాం. నెక్ట్స్ టైం నేను కానీ, మా టీం కానీ కలిసి చేసినా, విడివిడిగా చేసిన బెటర్ ప్రొడక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తామని వరుణ్ తేజ్ తెలిపారు.

  లాజిక్స్ ఉంటే అది డాక్యుమెంటరీ అవుతుంది

  లాజిక్స్ ఉంటే అది డాక్యుమెంటరీ అవుతుంది

  దర్శకుడు సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ... ‘అంతరిక్షం' సినిమాకు మంచి పబ్లిసిటీ కల్పించిన మీడియా వారికి థాంక్స్. మీ సపోర్ట్ మమ్మల్ని మరింత మోటివేట్ చేస్తోంది. చాలా మంది ఫ్యామిలీస్ తో వెళ్లి ఎంజాయ్ చేశారు. చాలా మంది ఫోన్ చేసి అభినందించడం నాకు మరింత బూస్ట్ ఇచ్చింది. తెలుగులో డిఫరెంట్ టైప్ మూవీ తీయొచ్చు అని ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు. మీడియా రివ్యూలు చదివాను. కొంత మంది లాజిక్స్ చెప్పారు. కానీ సినిమా అంటే లాజిక్స్ ఉండొద్దు. లాజిక్స్ ఉంటే డాక్యుమెంటరీ అయిపోతుంది. సినిమాపై వచ్చిన క్రిటిసిజాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అన్నారు.

   50 ఏళ్ల తర్వాత అనుకోకుండా...

  50 ఏళ్ల తర్వాత అనుకోకుండా...

  క్రిష్ మాట్లాడుతూ... డిసెంబర్ 21న అంతరిక్షం విడుదలైంది. యాదృశ్చికంగా 1968లో డిసెంబర్ 1న మానవుడితో కూడిన స్పేస్ షటిల్ అపోలో 8 చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చింది. 50 సంవత్సరాల తర్వాత అదే రోజు మా సినిమా విడుదలైంది. సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో మొట్టమొదటి సారిగా ప్యూర్ సైన్స్ ఫిక్షన్ సినిమా... సంకల్ప్ అద్భుతంగా డైరెక్ట్ చేశారు. పేరెంట్స్ తమ పిల్లలను తీసుకుని వెళుతున్నారు. ఇది కమర్షియల్ సినిమా కాదు. స్పేస్ థ్రిల్లర్ మూవీ. ఒక కొత్త అనుభూతి తెలుగు ప్రేక్షుకుడికి కలుగుతోంది. సినిమాలో గొప్ప విజువల్స్, గ్రేట్ విఎఫ్ఎక్స్, అందమైన కథ ఉంది. అద్భుతాలన్నీ ఈ సినిమాలో చూడొచ్చు అన్నారు.

  English summary
  Varun Tej about Anthariksham boxoffice result. Antariksham 9000 KMPH. The Science fiction space thriller film written and directed by Sankalp Reddy. The film stars Varun Tej, Aditi Rao Hydari and Lavanya Tripathi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X