»   » వరుణ్‌తేజ్‌ డెడికేషన్ బానే ఉంది గానీ ఆరోగ్యం!? ఫ్రాక్చర్ అయిన కాలుతోనే

వరుణ్‌తేజ్‌ డెడికేషన్ బానే ఉంది గానీ ఆరోగ్యం!? ఫ్రాక్చర్ అయిన కాలుతోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలం లోనే ప్రామిసింగ్‌ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న వరుణ్‌తేజ్‌ తాను చేసే పని మీద తన అంకితభావాన్ని నిరూపించుకున్నాడు.కాలి ఎముక చిట్లినా లెక్కచెయ్యకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం అతను హీరోగా నటిస్తున్న 'మిస్టర్‌' సినిమా షూటింగ్‌ కర్ణాటకలోని చిక్‌మగళూర్‌లో జరుగుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రం కోసం. శుక్రవారం ఉదయం ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాద వశాత్తూ వరుణ్‌ కాలికి గాయమైంది.

ఈ షూటింగ్ ప్రస్తుంత ఊటిలో జరుగుతోంది. వెంటనే వరుణ్ తేజని హాస్పటిల్ కు తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్ష చేసి, ట్రీట్మెంట్ ఇచ్చారు. పెద్దగా కంగారు పడాల్సింది లేదని, మూడు వారాలు రెస్ట్ తీసుకుని, మందుకు తీసుకుంటే సరిపోతుందని అంన్నారు. దాంతో షూటింగ్ ని ఆపుచేసారు. అయితే యూనిట్‌కు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో హాస్పిటల్‌ నుంచి నేరుగా సెట్స్‌పైకి వచ్చి, నొప్పిని భరిస్తూనే చిత్రీకరణలో పాల్గొన్నాడు వరుణ్‌.

Varun tej came back to shoot with fractured leg

అతడి అంకితభావం చూసి, యూనిట్‌ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. హీరోయిన లావణ్యా త్రిపాఠి సైతం తన హీరోను అభినందించకుండా ఉండలేకపోయింది. ''అతనెంతటి అంకితభావం ఉన్న నటుడంటే.. హాస్పిటల్‌ నుంచి తిరిగొచ్చి, ఎలాంటి బ్రేక్‌ తీసుకోకుండా ఓ పెద్ద సన్నివేశాన్ని నాతో కలిసి పూర్తిచేశాడు''అంటూ తన ట్విట్తర్ వాల్ పై పోస్ట్ చేసింది.

English summary
Mega Hero, Varun Tej Came back to shoot with fractured leg, Now he in Ooty for the shooting of his upcoming romantic entertainer, Mister
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu