»   » పూరీ జగన్నాథ్ కొత్త చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్

పూరీ జగన్నాథ్ కొత్త చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : నాగబాబు కుమారుడు వరుణ్ తేజ తెరంగ్రేటం కు అన్ని ఏర్పాట్లు పూర్తైన సంగతి తెలిసిందే. అశ్వనీదత్ నిర్మాతగా..వైజయింతీ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ మొదలు కానుంది.

ఇప్పటికే పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి సంభందించి స్క్రిప్టు వర్క్ పూర్తి చేసి వినిపించారని చెప్తున్నారు. మొదటి షెడ్యూల్ మలేషియాలోనూ,బ్యాంకాక్ లోనూ జరగనుందని తెలుస్తోంది. లవ్,యాక్షన్ ఎంటర్టైనర్ గా...హీరో పరిచయ చిత్రం ఎలా ఉండాలో ఖచ్చితంగా అలాగే పూరీ తీర్చిదిద్దనున్నారని వినికిడి.

పూరీ జగన్నాథ్, నాగబాబు కుమారుడు వరణ్ తేజ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి... మరో చిరుత అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 1 నుంచి ఈ చిత్తరం షూటింగ్ ప్రారంభమవుతుంది. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ ఎంట్రీ కోసం అభిమానులు, ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎంట్రీని గ్రాండ్ గా చేయాలని మెగా ఫ్యామిలీ సైతం ప్లాన్ చేస్తోంది. ఈ నేఫద్యంలో ఈ తొలి చిత్రానికి దర్శకుడుగా శ్రీకాంత్ అడ్డాలను ఎన్నుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయిత ఇప్పుడు సీన్ లోకి పూరీ జగన్నాథ్ వచ్చారు.


వాస్తవానికి 2009లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్‌తేజ్‌ హీరోగా ఎంటర్‌ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కార ణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్‌ తేజకు ఓకే కాలేదు. తర్వాత 2009, 2010లో ఇందు కు సంబం ధించిన ప్రయ త్నాలు జరి గినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీ యాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇషఉ్యతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దుకోవడంతో మళ్లీ వరుణ్‌తేజ్‌ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు.

English summary
Naga Babu's son Varun Tej is all set to make his debut under the direction of Puri jagannath. C.Aswini Dutt will be producing the film on Vyjayanthi Movies banner. According to sources the film's regular shoot will start from August first week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu