»   » ఫిదా అయిపోతారు: భానుమతి ఒక్కటే పీస్ హైబ్రీడ్ పిల్ల

ఫిదా అయిపోతారు: భానుమతి ఒక్కటే పీస్ హైబ్రీడ్ పిల్ల

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ఫిదా సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. జులై 21న విడుద‌ల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ మ‌ధ్య‌ టీజ‌ర్ తో ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేసింది.

ఇందులో వ‌రుణ్ తేజ్, సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య ఉన్న‌ కొన్ని సీన్స్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఇది కంప్లీట్ లవ్ స్టొరీ. అమెరికా అబ్బాయికి, తెలంగాణ అమ్మాయికి మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందనే భావాన్ని మనసుకు హత్తుకునేలా 'ఫిదా'లో చూపించబోతున్నారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల.అమెరికా కుర్రాడిగా వ‌రుణ్ తేజ్ లుక్ అదిరిపోయింది. సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిగా మాట్లాడుతున్న తీరు థియ‌ట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌తో విజిల్స్ వేయించే విధంగా ఉంది. శ‌క్తి కాంత్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. ప్రేక్ష‌కులకి ఈ ట్రైల‌ర్ న‌చ్చుతుంద‌ని తాను భావిస్తున్న‌ట్లు తెలుపుతూ హీరో వ‌రుణ్ తేజ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ ట్రైల‌ర్‌ను ఉంచాడు.


ఆ మద్య ఫస్ట్ లుక్, టీజర్ కి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. తెలంగాణ అమ్మాయి, అమెరికా అబ్బాయి ఎలా ప్రేమలో పడ్డారో 'ఫిదా'లో చూపించబోతున్నామని గతంలో శేఖర్ కమ్ముల చెప్పారు. ఇందులో వ‌రుణ్ తేజ్, సాయి ప‌ల్ల‌వి మ‌ధ్య ఉన్న‌ కొన్ని సీన్స్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఫిదా చిత్రంలో వ‌రుణ్ అమెరికా అబ్బాయిగా క‌నిపించ‌నుండ‌గా, సాయి ప‌ల్ల‌వి తెలంగాణ అమ్మాయి పాత్ర పోషించింది.


English summary
Varun Tej, Sai Pallavi's Telugu film seems like a love story that stems from hatred
Please Wait while comments are loading...