»   » మీడియాకీ షాక్ ఇస్తూ వరుణ్ తేజ ఫ్లైట్ ఎక్కాడు

మీడియాకీ షాక్ ఇస్తూ వరుణ్ తేజ ఫ్లైట్ ఎక్కాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: శ్రీనువైట్ల దర్శకత్వ లో వరుణ్‌ తేజ్‌ ఇప్పుడు 'మిస్టర్‌'గా ప్రాజెక్టు ఖరారు అయిన నాటి నుంచి ...ఈ షూటింగ్ మొదలైందా లేదా అన్న వార్తలు మీడియాలో రెండు రోజులకోసారైనా పలకరిస్తున్నాయి. వీసా ఫర్మిషన్స్ దొరక్క స్పెయిన్ షెడ్యూల్ లేటవుతోందంటే...ఫైనాన్స్ ప్లాబ్లంలతో లేటవుతోందనే వార్తలు వచ్చాయి.

అలాగే ఓ మూవ్ మెంట్ లో ప్రాజెక్టు ఆగిపోయిందంటూ రూమర్స్ గుప్పుమంటే వరుణ్ తేజ..అబ్బే లేదంటూ చెప్పాల్సి వచ్చింది. ఈ లోగా శేఖర్ కమ్ముల చిత్రం రిహార్సల్స్ జరుగుతున్నాయంటూ ట్వీట్ చేస్తే..ఇదిగో చూసారా..మేం చెప్పాం కదా..శ్రీనువైట్ల సినిమా లేనట్లే అని అనేసారు.

అయితే ఇక ఇప్పడు అలాంటి వార్తలు వచ్చే అవకాసం లేదు. ఎందుకంటే షూటింగ్ తొలి షెడ్యూల్‌ స్పెయిన్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని వరుణ్‌తేజ్‌ ట్విట్టర్‌లో తెలియజేస్తూ వర్క్‌ మూడ్‌ ఆన్‌.. అంటూ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌లు వరుణ్‌ తేజ్‌ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్‌, ఠాగూర్‌ మధు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఆ మధ్యన వరుణ్ తన కాస్ట్యూమ్ డిజైనర్‌తో కలిసి దుబాయ్ లో షాపింగ్ చేసాడు. అందుకు సంబందించి ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. మిస్టర్ మూవీలో తెలివైన కుర్రాడి పాత్ర పోషించనున్న వరుణ్ తేజ్ అందుకు తగ్గట్టు డ్రెస్సింగ్ ఉండేలా చూసుకుంటున్నాడు.

అదీ కాక ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తిగా స్పెయిన్‌లోనే జరగనుంది. అందుకోసం కాస్త రిచ్ లుక్‌ని మెయింటైన్ చేసేందుకు ఈ మెగా హీరో తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇదే కాక శేఖర్ కమ్ముల మూవీని కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళాలని వరుణ్ భావిస్తున్నాడు. ఇందులో వరుణ్ అమెరికా అబ్బాయిగా కనిపించనున్నాడు.

వరుణ్ తేజ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ కథ ఇదనీ, శ్రీను వైట్ల, వరుణ్ తేజ కాంబినేషన్లో రూపొందే ఈ చిత్రం క్లాస్ నీ, మాస్ నీ ఆకట్టుకునే విధంగా ఉంటుందనీ నిర్మాతలు తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తామని కూడా చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్ ('కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఫేమ్).

English summary
Today morning Varun Teja left to Spain in a British Airways flight and shared the same news with fans.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu