ప్రేమలో పడ్డాను .. ఆ విషయంలో పవన్ క్లాస్ పీకాడు.. వరుణ్ తేజ్

By Rajababu

వరుస విజయాలతో మెగా హీరో వరుణ్ తేజ్ దూసుకెళ్తున్నాడు. దా సక్సెస్ తర్వాత తొలిప్రేమ మళ్లీ సూపర్‌హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకొన్నాడు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తొలి ప్రేమ యూనిట్‌ను ప్రశంసించారు. తాజాగా సక్సెస్ జోష్ మీద ఉన్న వరుణ్ తేజ్ ఇటీవల ప్రముఖ దిన పత్రికతో తన వ్యక్తిగత, కుటుంబ, సినీ విషయాలను పంచుకొన్నారు. వరుణ్ తేజ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

 స్కూల‌్‌లో వన్‌సైడ్ లవ్

స్కూల‌్‌లో వన్‌సైడ్ లవ్

నేను సీరియస్‌గా ప్రేమలో పడిన దాఖలాలు లేవు. సినిమాల ప్రభావంతో స్కూల్‌లో ఓ అమ్మాయితో ఇష్టపడ్డాను. అప్పట్లో నాది వన్‌సైడ్ లవ్ మాత్రమే. నా మనసులో మాటను ఆమెకు చెప్పలేకపోయాను. కాకపోతే చనువుగా రెండు, మూడుస్లార్లు ఆమెతో మాట్లాడాను. ఆ తర్వాత ఆమె విదేశాలకు వెళ్లిపోవడంతో నా లవ్‌కు పుల్‌స్టాప్ పడింది.

Recommended Video

Tholi Prema 1st Day Collections
 చెల్లెలు నిహారిక పెళ్లిపై గాసిప్స్

చెల్లెలు నిహారిక పెళ్లిపై గాసిప్స్

మా చెలెల్లు నిహారిక పెళ్లి గురించి మీడియాలో చాలా గాసిప్స్ వచ్చాయి. తాను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకొంటే తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకొంటుంది. నిహారిక ప్రతిభావంతురాలు. నాకంటే తెలివైనది. ఏ విషయంలోనూ ఆమెపై బలవంతంగా అభిప్రాయాలను రుద్దబోము.

 చిరంజీవితో చనువుగా

చిరంజీవితో చనువుగా

నాకు పెదనాన్న చిరంజీవితో చాలా చనువు ఉంది. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చినప్పుడు మా కుటుంబం ముందుగా ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఎక్కువగా మా ఇంట్లోనే చిరంజీవి గారు ఉండేవాళ్లు. నేను, మా చెల్లెలు పెదనాన్నతో గడిపేవాళ్లం.

 చిరంజీవి స్ఫూర్తితోనే

చిరంజీవి స్ఫూర్తితోనే

ఇంద్ర 175 రోజుల ఫంక్షన్లో చిరంజీవికి ఉన్న క్రేజ్‌ను చూసి స్ఫూర్తి పొందాను. చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని చూసి ముగ్ధుడినయ్యాను. ఇంద్ర ఫంక్షన్‌కు తరలివచ్చిన జనం చూసి నటుడిగా మారాలని అప్పుడే నిర్ణయించుకున్నాను.

 పవన్ అలా హెచ్చరించాడు

పవన్ అలా హెచ్చరించాడు

బాబాయ్ పవన్ కల్యాణ్ చాలా తక్కువగా మాట్లాడుతారు. బాబాయ్‌తో గడపడానికి ఇష్టపడుతాను. పవన్‌ను ఎక్కువగా కలుస్తాను. జాగ్రత్తగా ఉండమని కొన్నిసార్లు తమను హెచ్చరిస్తుంటారు.

 నాకు, సాయికి పవన్ కల్యాణ్ క్లాస్

నాకు, సాయికి పవన్ కల్యాణ్ క్లాస్

ఒకరోజు సాయిధరమ్ తేజ్, నేను కలిసి రాత్రి వేళ బయటకు వెళ్లి ఆలస్యంగా వచ్చాం. అప్పుడు బాబాయ్ సీరియస్ మాకు క్లాస్ పీకారు. చిరంజీవి అనే భారీ వృక్షం కింద మనం ఉన్నాం. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించవద్దు. జీవితాన్ని సీరియస్‌గా తీసుకోవాలి అని పవన్ చెప్పారు.

 నాలో మార్పు వచ్చింది..

నాలో మార్పు వచ్చింది..

చిరంజీవిని చూసి అవకాశాలు ఎవరూ ఇవ్వరు. మీ వ్యక్తిగత ప్రతిభపైనే మీ కెరీర్ ఆధారపడి ఉంటుంది. మనం తీసుకొనే నిర్ణయాలపైనే జీవితం ఆధారపడి ఉంటుంది. అప్పటి నుంచి మాలో మార్పు వచ్చింది అని వరుణ్ తేజ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X