»   » వరుణ్ తేజ్- క్రిష్ మూవీ లొకేషన్లో ఇలా.. (ఫోటో)

వరుణ్ తేజ్- క్రిష్ మూవీ లొకేషన్లో ఇలా.. (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాల ఫేం క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా ఓ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి ‘కంచె' అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసి లాంచ్ చేసారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజీవ్ రెడ్డి నిర్మాత.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆన్ లొకేషన్ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. ఈ స్టిల్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఇది పీరియడ్ డ్రామా. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో కూడా హీరోయిన్.


Varun Tej - Krish movie on location still

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.


తొలి సినిమా ‘ముకుంద'తో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట. దీని తర్వాత మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్నారు.

English summary
Here is mega hero Varun Tej caught on the sets of his latest movie. He is currently busy acting in the direction of director Krish, whose movie’s tentative title is “Kanche”. Also spotted the picture is heroine Praigya Jaswal, a dazzling diva from Mumbai.
Please Wait while comments are loading...