»   » ఈనెల్లోనే నెక్ట్స్ మూవీ: వరుణ్ తేజ్ ప్రకటన

ఈనెల్లోనే నెక్ట్స్ మూవీ: వరుణ్ తేజ్ ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘ముకుంద' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఖరారైంది. ఇందుకు సంబంధించిన విషయాలను వరుణ్ తేజ్ తన మైక్రోబ్లాగింగ్ ద్వార ప్రకటించారు. క్రిష్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి నిర్మించబోతున్నారు. ఫిబ్రవరి 27న ఈ చిత్రం ప్రారంభం కానుంది.

ఈ విషయమై ఆయన ట్వీట్ చేస్తూ ‘హే ట్వీప్స్...నా తర్వాతి సినిమా ఈ నెల 27న ప్రారంభం అవుతుంది. ఈ చిత్రాన్ని క్రిష్ హ్యాండిల్ చేస్తున్నారు. రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది' అని వరుణ్ తేజ్ ప్రకటించారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

Varun Tej next on 27th this month

తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట. దీని తర్వాత మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్నారు. అయితే ముందుగా క్రిష్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అవుతుంది.

English summary
"Hey tweeps..Starting my next movie on the 27th this month..Krissh is handling the direction and Rajiv reddy is producing...Excited!!!" Varun Tej tweeted.
Please Wait while comments are loading...