»   » రొమాన్స్ మూడ్ లో : వరుణ్ తేజ, రెజీనా కలిసి...(ఫొటో)

రొమాన్స్ మూడ్ లో : వరుణ్ తేజ, రెజీనా కలిసి...(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగ బాబు కుమారుడు వరుణ్ తేజ, రెజీనా కలిసి ఇదిగో ఇలా ఇన్ ద మూడ్ ఆప్ లవ్ అంటూ లీనమై ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకుంటున్నారు. ఇంతకీ ఈ ఫొటో సౌత్ స్కోప్ పత్రిక కోసం తీసిన స్టిల్ ఇది. వీరిద్దమరి మధ్యా అద్బుతమైన కెమిస్ట్రీ కుదరిందని చెప్తున్నారు. వీరిద్దరూ కలిసి ఓ చిత్రంలో పని చేయనున్నారా ...అవుననే వినపడుతోంది. ఈ లోగా ఈ ఫొటోని చూడండి.

తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'ముకుంద' చిత్రాన్ని చేసిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ త్వరలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సి. కల్యాణ్ తెలిపారు. ఇది ఈ ఏడాది ప్రారంభమవుతుంది.

Varun Tej & Regina together

అలాగే, కొత్త సంవత్సరంలో పలు భారీ చిత్రాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు కల్యాణ్ తెలిపారు. నితిన్ తో ఒక సినిమా, నాగచైతన్య తో ఒక సినిమా ప్లానింగులో వున్నాయని చెప్పారు. 'కేడీ' సినిమా తర్వాత నాగార్జునతో ఓ సినిమా నిర్మించాల్సివుందనీ, సరైన కథ దొరకక ఇంకా సెట్స్ కి వెళ్ళలేదనీ అన్నారు.

ఇటీవలే నాగార్జున కోసం... నలుగురు అమ్మాయిల మధ్య హీరో అనే కాన్సెప్టుతో ఓ కథ విన్నానని ఆయన తెలిపారు. ఇది నాగార్జునకు బాగా సూటవుతుందని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా తమకు వచ్చే ఏడాది ఓ సినిమా వుందని నిర్మాత కల్యాణ్ తెలియజేశారు.

English summary
Varun teja and regina two are spotted together, as they posed together for the latest edition of famous cinema magazine 'Southscope'.
Please Wait while comments are loading...