»   » సూపర్: వరుణ్ తేజ్ ‘కంచె’ ఫస్ట్ టీజర్ (వీడియో)

సూపర్: వరుణ్ తేజ్ ‘కంచె’ ఫస్ట్ టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వరుణ్ తేజ్ తాజా సినిమా ‘కంచె' ఫస్ట్ టీజర్ విడుదల చేసారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భాన్ని, దేశం కోసం పోరాటిన వీరులను గుర్తు చేసే విధంగా డిజైన్ చేసిన టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. టీజర్ పై మీరూ ఓ లక్కేయండి.

ఇది పీరియడ్ డ్రామా. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈచిత్రంలో వరుణ్ తేజ్ సైనికుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో నటించింది. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Varun Tej's Kanche Movie Teaser

మెగా ఫ్యామిలీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘కంచె' రషెస్ చూసిన నాగబాబు షాకయ్యారని, తాను ఊహించిన దానికంటే సినిమా చాలా బాగా వచ్చిందని ఆయన తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. స్టన్నింగ్ విజువల్ష్, గ్రాండ్ గా తెరకెక్కించిన సన్నివేశాలు, వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ తో ‘కంచె' మూవీ అదిరిపోయే రేంజిలో ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Varun Tej, Pragya Jaiswal starrer Kanche first Teaser released. A film directed by Krish.
Please Wait while comments are loading...