»   » వీడియో ‌: వరణ్ తేజ 'కంచె' స్పెషల్‌ ట్రైలర్‌

వీడియో ‌: వరణ్ తేజ 'కంచె' స్పెషల్‌ ట్రైలర్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: వరుణ్‌ తేజ్‌, ప్రగ్యా జైశ్వాల్‌లు జంటగా నటించిన చిత్రం 'కంచె',క్రిష్‌ దర్శకుడు. అక్టోబర్‌ 22న దసరా కి విడుదలైన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ఫస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు యూట్యూబ్‌ ద్వారా కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.


దసరా కానుకగా విడుదలైన క్రిష్ చిత్రం 'కంచె 'కు కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు గంటల ఐదు నిముషాలు రన్ టైమ్ ఉన్న ఈ సినిమా దాంతో లెంగ్త్ పెరగనుంది. సాధారణంగా సినిమా రిలీజ్ అయ్యాక రన్ టైమ్ తగ్గించటానికి ట్రిమ్ చేసి అనవసర సీన్స్ కట్ చేస్తూంటారు. అయితే 'కంచె ' కు రివర్స్ లోజరుగుతోంది. సీన్స్ రెండో రోజుకే కలపుతున్నారు. చిత్రం షేర్ ఇరవై కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.అలాగే కొన్ని ప్రాంతాల్లో స్క్రీన్స్ సైతం పెరుగుతున్నట్లు వినికిడి.


చిరంజీవి మాట్లాడుతూ ''కంచె... విజయవంతమైన ఓ మంచి ప్రయత్నం. దర్శకుడు చక్కటి కథ, కథనాలతో సినిమాని బాగా అల్లాడు. మా అబ్బాయి వరుణ్‌తేజ్‌ పాత్రలో ఒదిగిపోయిన తీరు నచ్చింది. 1936లోని కథానాయకుడిగానే కనిపించాడు. పల్లెటూరి సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. తండ్రిగా నేను గర్వపడుతున్నా. మాటల రచయిత సాయిమాధవ్‌ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించాలి.


Varun Taj's Kanche New Trailer

పుట్టినరోజు, కులాలు, మనస్పర్థల గురించి ఎంతో తాత్వికంగా సంభాషణలు రాశారాయన. ప్రతి సంభాషణ ఆలోచన రేకెత్తించేలా, చైతన్యం తీసుకొచ్చేలా ఉంది. యుద్ధం నేపథ్యంతో కూడిన ఈ సినిమాని కేవలం 55 రోజుల్లో తీశారని తెలిసి ఆశ్చర్యపోయా. 125, 150 రోజులు అంటూ సినిమాని తీసుకొంటూ వెళ్లిపోతున్న రోజులివి. ఇంత తక్కువ సమయంలో పూర్తి చేశారంటే నిజంగా ఈ సినిమా దర్శకుడి ప్రతిభకు గీటురాయి. క్రిష్‌ నుంచి ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి''అన్నారు.

English summary
Varun Teja's Kanche movie new trailer released.
Please Wait while comments are loading...