»   » షాకవ్వొద్దు... ఇతను మెగా హీరో వరుణ్ తేజే (న్యూ లుక్)

షాకవ్వొద్దు... ఇతను మెగా హీరో వరుణ్ తేజే (న్యూ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇక్కడ కనిపిస్తున్న ఫోటో చూసి ఇతను ఎవరో హాలీవుడ్ నటుడు అని అనుకోవద్దు సుమీ! ఇతను మన తెలుగు హీరో, మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో వరుణ్ తేజ్ ఇలా స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు.

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో వరుణ్ తేజ్ శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్ ఓకే అయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి.

'ముకుంద' చిత్రం ద్వారా వరుణ్ తేజ్ ను హీరోగా పరిచయం చేసిన 'ఠాగూర్' మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ని అందించిన శ్రీను వైట్ల తనదైన శైలిలో విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Varun Tej's Never-Seen-Before look

లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో వరుణ్ తేజ్ సరసన ఇద్దరు ప్రముఖ కథానాయికలు నటించనున్నారు. ఏప్రిల్ 8 ఉగాది పర్వదినం నాడు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.

వరుణ్ తేజ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ కథ ఇదనీ, శ్రీను వైట్ల, వరుణ్ తేజ కాంబినేషన్లో రూపొందే ఈ చిత్రం క్లాస్ నీ, మాస్ నీ ఆకట్టుకునే విధంగా ఉంటుందనీ నిర్మాతలు తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తామని కూడా చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్ ('కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఫేమ్).

English summary
Varun Tej went for complete makeover for his next movie under the direction of Sreenu Vaitla. In his latest photo shoot, The lanky actor looks damn stylish to remind us of some of the renowned Hollywood Actors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu