»   » రొమాంటిక్ కామెడీ.... తెలుగులోనా..?? అదీ వరుణ్ తేజ్ తో..మీరు ఊహించలేరు

రొమాంటిక్ కామెడీ.... తెలుగులోనా..?? అదీ వరుణ్ తేజ్ తో..మీరు ఊహించలేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రావటం రావటమే ఒకే ఒక సంవత్సరంలో 3 సినిమాలు చేసేసి సూపర్ స్పీడ్ చూపించిన మెగా హీరో వరుణ్ తేజ్.. ఎందుకో గానీ కాస్త స్లో అయ్యాడు. కంచె తర్వాత క్రిష్ తో అనుకున్న ప్రాజెక్ట్ బాలకృష్ణ 100 సినిమావల్ల వెనక్కిపోయింది. ఇక శ్రీను వైట్ల మిస్టర్ పట్టాలెక్కడానికి ఆలస్యం కావడంతో.. గతేడాది డిసెంబర్ లో పూరీ జగన్నాథ్ తో చేసిన వచ్చిన లోఫర్ తర్వాత సినిమానే లేదు. అయితే.. ఇప్పుడు మాత్రం ఒక పక్క శ్రీనూ వైట్ల "మిస్టర్" చేస్తూనే మరోవైపు శేఖర్ కమ్ములతో ఫిదా చిత్రాన్ని కంప్లీట్ చేసేస్తున్నాడు వరుణ్ తేజ్.

పాత్రను బట్టి నటీనటుల్ని ఎంచుకోవడం శేఖర్ కు అలవాటు. ఫలానా పాత్రకు కరెక్ట్ గా ఆ హీరోనే సరిపోతాడు అనే నమ్మకం బలంగా ఉంటుంది. ఆ ఆలోచనతోనే...మహేష్ బాబు తో సినిమా చేయాలని కథ తయారు చేసుకున్నాడు శేఖర్ కమ్ముల. ఆ కథ తో సినిమా చేయడం ఖాయమని అప్పట్లో అనుకున్నారు కూడా. కానీ మహేష్ మాత్రం ఆ సినిమా చేయలేదు. అయితే... మహేష్ రిజెక్ట్ చేసిన కథనే ఇప్పుడు మెగా వారసుడు వరుణ్ తేజ్ చేస్తున్నాడట.

Varun tej

ప్రస్తుతం చిక్మంగళూరులో మిస్టర్ షూటింగ్ లో ఉన్న వరుణ్ తేజ్.. మూడో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. రీసెంట్ గా ఫిదా కోసం బాన్సువాడలో షూట్ చేస్తున్న టైమ్.. గుండెజారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయకుమార్ కొండా ఓ నేరేషన్ ఇచ్చాడట. రెండున్నర గంటల ఈ నెరేషన్-స్టోరీ వరుణ్ తేజ్ కి విపరీతంగా నచ్చేశాయట. మిస్టర్.. ఫిదాల తర్వాత ఇలాంటి రొమాంటిక్ కామెడీ చేయడమే కరెక్ట్ అని ఫీల్ అయ్యి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట కూడా.

ఆ తర్వాత నాగబాబుకి కూడా విజయ్ కుమార్ కొండా స్టోరీ చెప్పడం.. నాగబాబుకూడా పచ్చజెండా ఊపేసారట. ఇక పట్టాలెక్కడమే లేట్. త్వరలో వరుణ్ తేజ్-విజయ్ కుమార్ కొండా కాంబినేషన్ లో పై అనౌన్స్ మెంట్ చేయనుండగా.. డిసెంబర్ చివర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న కొత్త సినిమా ఫిదా. దిల్ రాజు ఈ సినిమా తీస్తున్నాడు. తెలంగాణ ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకొని ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఆ మధ్య నయనతారతో తీసిన అనామిక...మూవీ ఫ్లాప్ కావడంతో శేఖర్ కొంత డిసపాయింట్ అయ్యాడు.ఇప్పుడు ఫిదా తో తనకూ, వరుణ్ కీ కూడా మంచి బూస్ట్ కోసం కష్ట పడుతున్నాడు.

English summary
Varun Tej team up with Vijaykumar Konda the Director of "Gunde Jaari Gallantayyinde". for next project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu