»   » మూడో రికార్డ్ పై గురి పెట్టిన వరుణ్ తేజ్..టాలీవుడ్ లో అతడే ఫస్ట్ హీరో!

మూడో రికార్డ్ పై గురి పెట్టిన వరుణ్ తేజ్..టాలీవుడ్ లో అతడే ఫస్ట్ హీరో!

Subscribe to Filmibeat Telugu
First Space Film of Tollywood?

మెగా హీరో వరుణ్ తేజ్ నటుడిగా వరుస రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆధిపత్యంతో కొనసాగిన మెగా ఫ్యామిలిలో ప్రస్తుతం అల్లు అర్జున్, రామ్ చరణ్ లు పెద్ద స్టార్ లుగా కొనసాగుతున్నారు. కానీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం మెగా అభిమానుల అండతో పాటుగా సొంత ఇమేజ్ ని బలపరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇప్పటికే మెగా ఫ్యామిలిలో ఏ హీరోకి సాధ్యం కానీ లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న వరుణ్, టాలీవుడ్ లో మరె హీరో సాహసించని పాత్ర వైపు అడుగులు వేస్తున్నాడు.

టాలీవుడ్ లో ఫస్ట్ హీరో అతడే

టాలీవుడ్ లో ఫస్ట్ హీరో అతడే

వరల్డ్ వార్ 2 నేపథ్యం ఉన్న కథలో నటించిన తొలి టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ కావడం విశేషం. వరుణ్ తేజ్ కంటించిన కంచె చిత్రం రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం విజయం సాధించకున్నా వరుణ్ నటనకు ప్రశంసలు దక్కాయి.

తొలి మెగా హీరో

తొలి మెగా హీరో

మెగా ప్రిన్స్ గా కీర్తించబడుతున్న వరుణ్ తేజ్ కు క్రమంగా లవర్ బాయ్ ఇమేజ్ పెరుగుతోంది. మెగా ఫ్యామిలిలో ఆరడుగుల అందగాడు వరుణ్ కావడం విశేషం.

వరుస హిట్లతో జోరు

వరుస హిట్లతో జోరు

ఫిదా చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్ నేడు తొలిప్రేమ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిప్రేమ చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. తొలిప్రేమ చిత్రంలో వరుణ్ అద్భుతమైన నటన కనబరిచాడంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

ఆ ఘనత సాధించబోతున్న తొలి టాలీవుడ్ హీరో

ఆ ఘనత సాధించబోతున్న తొలి టాలీవుడ్ హీరో

వరుస హిట్లతో జోష్ లో ఉన్న వరుణ్ తేజ్ తాజగా మరో చిత్రాన్ని ఒకే చేసాడు. అది కూడా అలాంటి ఇలాంటి చిత్రం కాదు. స్పేస్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న చిత్రం. టాలీవుడ్ లో ఇంతవరకు స్పేస్ నేపథ్యంలో సినిమా రాలేదు. దీనితో ఆ ఘనత అందుకోబోతున్న తొలి టాలీవుడ్ హీరోగా వరుణ్ అవతరించనున్నాడు.

సంచలన దర్శకుడి దర్శకత్వంలో

సంచలన దర్శకుడి దర్శకత్వంలో

ఘాజి చిత్రంతో మెస్మరైజ్ చేసిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. అండర్ వాటర్ మిషన్ గా సబ్ మెరైన్ యుద్ధం నేపథ్యంలో ఘాజి చిత్రాన్ని సంకల్ప్ రెడ్డి అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన చెప్పిన స్పెస్ కథ నచ్చడంతో వరుణ్ ఒకే చేసినట్లు తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఆకర్షణగా నిలవనున్నాయట.

English summary
Varun Tej said ok to sensational project. Ghazi fame Sankalp Reddy is the director for varun new movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu