»   »  వరుణ్ తేజ్ మూవీ చేయబోతున్న శేఖర్ కమ్ముల-దిల్ రాజు

వరుణ్ తేజ్ మూవీ చేయబోతున్న శేఖర్ కమ్ముల-దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తక్కువ కాలం లో, విన్నూత్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అటు యువతను ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చక్కటి కథా బలం ఉన్న చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరి తో, ఉత్తమ కథా చిత్రాల నిర్మాత గా పేరు ఉన్న దిల్ రాజు త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు.

Varun Tej - Sekhar Kammula - Dil Raju Film Launch Soon

ఒక అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, "శేఖర్ కమ్ముల ఒక వండర్ఫుల్ స్టొరీ టెల్లర్. వరుణ్ తేజ్ ఇప్పటికే మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికా లో ఉండే ఒక అబ్బాయి కి , తెలంగాణా లో పెరిగిన ఒక అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథ ఈ చిత్రం. త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుంది", అని తెలిపారు. ఈ చిత్ర తారాగణం, సాంకేతిక నిపుణులు మరియు ఇతర వివరాలను త్వరలోనేవిడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది.

Also Read: వరుణ్ తేజ్ -శ్రీను వైట్ల కొత్త చిత్రం 'మిస్టర్' (ఫోటోస్)

శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్..
మరో వైపు వరుణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), 'ఠాగూర్' మధు 'మిస్టర్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభం అయింది. అందుకు సంబంధించిన ఫోటోలు పైన లింక్ క్లిక్ చేసి చూడొచ్చు.

English summary
Mega Prince Varun Tej has established a unique identity for himself within a short span of time, with his story selection and acting abilities. Sekhar Kammula is known for making clean entertainers that attract young adults as well as family crowds. The two of them will now be working with noted producer Dil Raju very soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu