»   » పవనిజం అంటే అదేనని చెప్పా: హైపర్, ఆ విషయం లీక్ చేసిన దిల్ రాజు..

పవనిజం అంటే అదేనని చెప్పా: హైపర్, ఆ విషయం లీక్ చేసిన దిల్ రాజు..

Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను విపరీతంగా ఆరాధించేవాళ్లలో జబర్దస్త్ హాస్యనటుడు హైపర్ ఆది కూడా ఒకరు. పవన్ ఫ్యాన్స్‌తో ఫిలిం క్రిటిక్ కత్తి వివాదం నడిచినన్నిరోజులు.. ఆది ఆయనకు కౌంటర్స్ ఇస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అలా సందర్భం వచ్చిన ప్రతీసారి తాను పవన్ అభిమాని అని చాటుకుంటూనే ఉంటాడు ఆది. తాజాగా తొలిప్రేమ ఆడియో ఫంక్షన్ లోనూ పవన్ పై తన అభిమానం చాటుకున్నాడు.

పవనిజం అంటే అదే..: హైపర్ ఆది

పవనిజం అంటే అదే..: హైపర్ ఆది

తొలిప్రేమ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడిన హైపర్ ఆది 'పవనిజం' అంటే ఏంటో చెప్పాడు. 'ఇందాకా ఆడియో ఫంక్షన్‌కు బయలుదేరుతుంటే.. హోటల్ అతను అడిగాడు పవనిజం అంటే ఏంటని?. ఒక్కసారి పవన్ కల్యాణ్ గారికి ఫ్యాన్ అయితే ఇక చచ్చేదాకా ఆయన ఫ్యాన్ గానే ఉంటారు. ఇది నిజం.. ఇదే పవనిజం' అని చెప్పినట్టు హైపర్ ఆది వెల్లడించారు.

'భీమవరం సూరి రాజు':

'భీమవరం సూరి రాజు':


ఇక మీ తొలిప్రేమ గురించి చెప్పాలని యాంకర్స్ హైపర్ ఆదిని అడగ్గా.. నా తల్లిదండ్రులే నా తొలిప్రేమ అని స్పష్టం చేశాడు ఆది. తొలిప్రేమ అందరికీ నచ్చే సినిమా అవుతుందని, ఇందులో తన పాత్ర పేరు 'భీమవరం సూరి రాజు' అని చెప్పాడు. థియేటర్స్ లో ఇక కావాల్సినంత దున్నుకోవచ్చని అభిమానులను హుషారెత్తించాడు.

వరుణ్ తేజ్ స్పీచ్..:

వరుణ్ తేజ్ స్పీచ్..:


భీమవరం ప్రాంతంతో నాకు చాలా అనుబంధం ఉంది. నా తొలి సినిమా తొలి షూటింగ్ ఇక్కడే జరిగింది. ఈ సినిమా విషయానికొస్తే.. బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌ 'తొలిప్రేమ' టైటిల్ ను చెడగొట్టలేదని హామి ఇస్తున్నా. ఆ తొలిప్రేమ స్థాయిలోనే ఈ సినిమా కూడా ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది.

'ఇంటిలిజెంట్' కూడా చూడండి:వరుణ్

'ఇంటిలిజెంట్' కూడా చూడండి:వరుణ్


1998లో బాబాయ్‌ పవన్‌ తొలిప్రేమ విడుదలైంది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత అదే పేరుతో నా సినిమా రావడం సంతోషంగా ఉంది. విడుదల తర్వాత మళ్లీ భీమవరం వస్తా. మెగాస్టార్ ఫ్యాన్స్‌కు, కల్యాణ్ బాబాయ్ ఫ్యాన్స్‌కు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ నెల 9న తేజు బాబు 'ఇంటిలిజెంట్' సినిమా వస్తుంది. ఆ సినిమాను కూడా ఆదరించండి.

భీమవరం నీళ్లలోనే ఏదో ఉంది: హైపర్ ఆది

భీమవరం నీళ్లలోనే ఏదో ఉంది: హైపర్ ఆది


నిర్మాత, తొలిప్రేమ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మాట్లాడుతూ.. 'మీ భీమవరంలో ఏదో తెలియని శక్తి ఉంది. భీమవరం పేరును పాటల్లో వింటుంటాం.. ఇక్కడినుంచే ప్రభాస్ వచ్చాడు, ఈ ప్రాంతం నుంచే మెగాస్టార్ వచ్చారు.. ఇక్కడి నీళ్లలోనే ఏదో ఉంది. ఇక ఈ సినిమా 100శాతం యూత్ మెచ్చే సినిమా. ఫిబ్రవరి 10తర్వాత యూత్ అంతా క్లాసులు ఎగ్గొట్టి సినిమా చూస్తారు పక్కా..' అని చెప్పుకొచ్చారు.

దిల్ రాజు లీక్ చేశాడు:

దిల్ రాజు లీక్ చేశాడు:

తొలిప్రేమకు యు/ఏ సర్టిఫికెట్ వచ్చిందని చెబుతూ.. సినిమాలో ఒకచోట లిప్ లాక్ సన్నివేశం ఉందని చెప్పేశారు దిల్ రాజు. నిర్మాత అనుమతి తీసుకోకుండానే ఈ విషయాన్ని లీక్ చేస్తున్నట్లు తెలిపారు. ఏ సర్టిఫికెట్ వచ్చినా.. ఇందులో అభ్యంతరకర సన్నివేశాలు ఏమి లేవని అందరూ చూడవచ్చని తెలిపారు. మెగా అభిమానులకు పండగలాంటిదని చెప్పారు.

 బీవీవీ ప్రసాద్:

బీవీవీ ప్రసాద్:

బన్నీతో ఆర్య-2, చరణ్‌తో మగధీర, పవన్‌తో అత్తారింటికి దారేదీ వంటి హిట్ సినిమాలు చేశాం.మెగాప్రిన్స్‌ వరుణ్‌తో తొలిప్రేమ చేయడం సంతోషం. గత సినిమాల్లాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది.

English summary
The title of the movie, Tholi Prema, carries a history. Exactly 20 years ago, a movie with the same title converted Pawan Kalyan, a budding actor into a huge star in the Tollywood compound.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu