»   » రూమర్స్ కు చెక్ పెట్టడానికే వరుణ్ తేజ ట్విట్టర్ లోకి వచ్చి మరీ...

రూమర్స్ కు చెక్ పెట్టడానికే వరుణ్ తేజ ట్విట్టర్ లోకి వచ్చి మరీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గతి కొద్ది రోజులుగా...మీడియాలో శ్రీను వైట్ల, వరుణ్ తేజ కాంబినేషన్ లో మొదలైన సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి.మిస్టర్ పేరుతో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఏప్రిల్ నెలాఖరున పూజా కార్యక్రమాలతో మొదలైంది. అయితే నేటి వరకూ సెట్స్ మీదికి వెళ్ళకపోవడంతో ఈ సినిమాపై రూమర్స్ మొదలయ్యాయి.

దానికి తోడు శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ సినిమా ప్రారంభం కాబోతోందంటూ వార్తలు రావటంతో గాలికి ఆజ్యం పోసినట్లైంది. అప్పటికీ మధ్యలో రచయిత గోపీ మోహన్ కలగజేసుకుని ఒకటి రెండు సార్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. కానీ ఈ విషయమై దర్శక,నిర్మాతలు కానీ హీరో కానీ మాట్లాడకపోవటంతో ఆయన మాటలకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇదంతా హీరో వరుణ్ తేజ్ గమనించినట్లున్నారు. ట్విట్టర్ లోకి వచ్చి ఈ సినిమా విషయమై పూర్తి క్లారిటీ ఇచ్చాడు .

వరుణ్ తేజ చెప్పినదాని ప్రకారం...ఈ నెల 27 నుండి స్పెయిన్‌లో తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది. గోపీమోహన్ కథ అందిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా కనపడనుంది. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాకి సంగీతం: మిక్కీ జే మేయర్, మాటలు : శ్రీధర్ సీపాన, కెమెరా: జె.యువరాజ్.

English summary
Varun Tej took to his Twitter profile and wrote, “Can’t wait to get back to work and back on sets.My film with Srinu Vaitla garu will start rolling in Spain from 27th.” Mister is a romantic comedy entertainer and the film will be produced by Tagore Madhu and Nallamalupu Bujji.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu