For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Raja Vikramarka teaser: కృష్ణ, టామ్ క్రూజ్ చూసి.. సరదా తీరిపోతున్నది.. కార్తీకేయ బాడీ లాంగ్వేజ్ అదుర్స్

  |

  యువ హీరో కార్తీకేయ గుమ్మకొండ నటిస్తున్న రాజా విక్రమార్క చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో మీడియా సమక్షంలో రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం మెగా హీరో వరుణ్ తేజ్ చేతుల మీదుగా జరిగింది. శ్రీ సారిపల్లి దర్వకత్వంలో, 88 రామారెడ్డి నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ఆవిష్కరణ కార్యక్రమంలో సాయికుమార్, కార్తీకేయ గుమ్మకొండ, సుధాకర్ కోమాకుల, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి, చిత్ర సమర్పకులు ఆదిరెడ్డి, సినిమాటోగ్రాఫర్ పీసీ మౌళి, ఎడిటర్ జస్విన్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. నిర్మాత 88 రామారెడ్డి, దర్శకుడు శ్రీ సరుపల్లి తదితరులు పాల్గొన్నారు.

  పాపులర్ హిందీ పాట ఏక్ లడ్కీ భీగీ భాగిసీ తో టీజర్ ప్రారంభమై కామెడీ, ఫన్‌, ఎమోషనల్ కంటెంట్‌తో ముగిసింది. తనికెళ్ల భరణి, కార్తీకేయ మధ్య సీన్లు చాలా ఆసక్తికరంగా కనిపించాయి. ఎన్ఐఏ అధికారిగా కార్తీకేయ బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా ఉంది. చిన్నపుడు కృష్ణను, ఆ తర్వాత టామ్ క్రూజ్‌ను చూసి ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు సరదా తీరిపోతుందంటూ కార్తీకేయ ఇచ్చిన పంచ్ బాగుంది.

  Varun Tej Unveils Raja Vikramarka teaser: Kartikeya Gummakonda rocks

  రాజా విక్రమార్క టీజర్ రిలీజ్ అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ.. శ్రీ సారిపల్లి కథ చెప్పిన తీరు.. నవ్వుతూ పనిచేయించకొనే విధానం నచ్చింది. కార్తీకేయ హీరో అనగానే బాగా అనిపించింది. కార్తీకేయ చాలా మంచి వ్యక్తి. నేను పోలీస్ కథలతోనే సినిమా జీవితాన్ని ప్రారంభించి ఇక్కడ వరకు వచ్చాం. ప్రతీ రోజు నేను ఏదో నేర్చుకొంటూనే ఉంటున్నాం. కార్తీకేయ ప్రతీ రోజు పోలీస్ స్టోరీ సినిమా గురించి, నా గురించి శ్రద్దగా అడిగి తెలుసుకొన్నారు. ఇప్పుడు మహేష్, పవన్ కల్యాణ్, అజిత్ ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. రాజ విక్రమార్క తప్పకుండా హిట్ అవుతుంది. స్టైలీష్ ఫిల్మ్ అని చెప్పవచ్చు. నిర్మాతలు ఈ సినిమా నిర్మాణంలో కాంప్రమైజ్ కాలేదు. సుధాకర్ కోమాకుల మరో అగ్నిగా కనిపిస్తారు. అలాగే రవిచంద్రన్ మనువరాలు తాన్య ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. 88 రామారెడ్డికి అష్టఐశ్వర్యాలు అందడం ఖాయం అని సాయికుమార్ అన్నారు.

  సుధాకర్ కోమాకుల మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం దర్శకుడు శ్రీ సారిపల్లి, కార్తీక్ గుమ్మకొండ. శ్రీ సారిపల్లి నాకు అమెరికాలోనే పరిచయం. ఆయన ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేసి వినాయక్ వద్ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాడు. హాలీవుడ్, తెలుగు సినిమా అంశాలను మిక్స్ చేసి న్యూఏజ్ సినిమాగా రూపొందించాడు. ప్రశాంత్ విహారి మ్యూజిక్ బాగుంది. ఈ సినిమా తప్పకుండా మైలురాయిగా నిలుస్తుంది. మెగాస్టార్ సినిమా టైటిల్‌తో వస్తున్నాం. తప్పకుండా హిట్ కొడుతాం అని అన్నారు.

  నిర్మాత 88 రామారెడ్డి మాట్లాడుతూ.. నేను తొలిసారి రాజా విక్రమార్క కోసం నిర్మాతగా మారాను. ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కార్తీకేయ. చిత్ర యూనిట్ పనితీరు చాలా ఆకట్టుకొన్నది అని అన్నారు.

  దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ.. కార్తీకేయ కొత్త డైరెక్టర్లను బాగా నమ్ముతాడు. అలాగే నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. నా మీద నమ్మకం పెట్టుకొని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చిత్ర యూనిట్ నాకు మంచి సహకరించింది. అందుకు థ్యాంక్స్ చెప్పుకొంటున్నాను. ఆయన పెట్టుకున్న అంచనాలను చేరుకుంటానని ఆశిస్తున్నాను. టీజర్ ప్రేక్షకులకు నచ్చిందని అనుకుంటున్నాను. సినిమా కూడా నచ్చాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

  హీరో కార్తీకేయ మాట్లాడుతూ.. రాజా విక్రమార్క చిత్ర టీజర్ ఈవెంట్‌ కోసం వచ్చిన మీడియాకు ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత మీడియాను కలుసుకోవడం హ్యాపీగా ఉంది. రాజా విక్రమార్క చిత్రం మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ పెట్టుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను చిరంజీవికి ఎంత పెద్ద ఫ్యాన్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. రామానాయుడు స్టూడియోలోనే ఆర్ఎక్స్ 100 సినిమా ట్రైలర్ రిలీజైంది. అప్పుడు కలిగిన ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇప్పుడు కలుగుతున్నాయి. ఆర్‌ఎక్స్ 100 తర్వాత ఈ సినిమా కథ విన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ సినిమా జరగడానికి జరిగిన కథను ఓ బయోపిక్ తీయొచ్చు. ఈ సినిమా ప్రారంభం కావడానికి చాలా సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో ఆదిరెడ్డి, రామారెడ్డి ముందుకు వచ్చి సినిమా చేసినందుకు ధన్యవాదాలు. ఆల్రెడీ టీజర్ రెస్పాన్స్ బావుంది. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాను. నేను బ్యాచిలర్‌గా చేసిన లాస్ట్ సినిమా ఇది. మంచి హిట్ కొట్టి జీవితంలో నెక్స్ట్ స్టెప్ వేస్తే చాలా బావుంటుంది. తప్పకుండా హిట్ కొడతామని నాకు తెలుసు అని అన్నారు.

  నటీనటులు: కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు
  సమర్పణ : ఆదిరెడ్డి టి,
  నిర్మాత: 88 రామారెడ్డి
  దర్శకత్వం: శ్రీ సరిపల్లి
  పీఆర్వో: పులగం చిన్నారాయణ
  ఛాయాగ్రహణం: పి.సి.మౌళి
  సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
  ఎడిటింగ్: జస్విన్ ప్రభు
  ఆర్ట్: నరేష్ తిమ్మిరి, శ్రీ రూప్ మీనన్
  ఫైట్స్: సుబ్బు, నబా
  పాటలు: రామజోగయ్య శాస్త్రి
  విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు
  సౌండ్ ఎఫెక్ట్స్: సింక్ సినిమా

  English summary
  Kartikeya Gummakonda's Latest movie is Raja Vikramarka. This movie teaser released by Varun Tej.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X