»   » ‘మిస్టర్’ వరుణ్ తేజ్ చాలా కష్టపడుతున్నాడు (వీడియో)

‘మిస్టర్’ వరుణ్ తేజ్ చాలా కష్టపడుతున్నాడు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీలో హీరోలంతా కష్టపడే తత్వం ఉన్న వారే... అందుకే అందరూ సినిమాల్లో సక్సెస్ అయ్యారు. నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్‌కు కూడా ఆ తత్వం అబ్బింది. వరుణ్ తేజ్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. వరుణ్ తేజ్ ఎలా కష్టపడుతున్నారో మీరూ ఓ లుక్కేయండి.

వరుణ్ తేజ్ త్వరలో 'మిస్టర్' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది. బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), 'ఠాగూర్' మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ హీరో వెంకటేశ్ క్లాప్ ఇచ్చారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ర్ట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ - "ఎన్నో ప్రత్యేకతలున్న చిత్రం ఇది. చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీ విత్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మూవీ చేస్తున్నాను. ఈ కథలో ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఉంది. ఇప్పటివరకూ వరుణ్ తేజ్ చేసిన సినిమాలకూ, ఈ సినిమాకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇందులో యూనివర్శిటీ టాపర్ గా వరుణ్ కనిపిస్తాడు. 'ఠాగూర్' మధుగారు, బుజ్జిగారు ఎక్కడా రాజీ పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. యంగ్ టీమ్ తో చేస్తున్న సినిమా ఇది. తొలి షెడ్యూల్ స్పెయిన్ లోనూ, మలి షెడ్యూల్ బ్రెజిల్ లోనూ జరుపుతాం. ఆ తర్వాత ఎక్కువ శాతం షూటింగ్ ను కర్నాటక బోర్డర్ లో జరపడానికి ప్లాన్ చేశాం'' అని చెప్పారు.

English summary
Check out VARUN TEJ workout Video. Varun Tej Next film Gets Impressive Title. The movie title is confirmed as Mister. The title seems perfect for him and he will be seen in a new avatar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu