»   » వరుణ్ తేజ్ ‘కంచె’.. (చిరు బర్త్ డే స్పెషల్ పోస్టర్)

వరుణ్ తేజ్ ‘కంచె’.. (చిరు బర్త్ డే స్పెషల్ పోస్టర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె '. ఇటీవల విడుదలైన కంచె ఫస్ట్, లుక్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘కంచె' కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.

ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎవరూ చిత్రీకరించని రెండవ ప్రపంచ యుద్ధ పోరాట సన్నివేశాలు ‘కంచె' చిత్రానికి స్పెషల్ హైలైట్ గా నిలుస్తాయి. జార్జియా దేశం లో, రియల్ వరల్డ్ వార్ 2 వెపన్స్ , యుద్ధ ట్యాంక్స్ , యూనిఫాం, లొకేషన్స్‌ను వాడుకుని, భారీ వ్యయం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


VarunTej's Kanche Chiranjeevi birthday special poster

ఈ చిత్రం టీజర్ ను ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భం గా చిత్ర బృందం విడుదల చేసింది. సుమారు 45 సెకండ్ల రన్ టైం ఉన్న ఈ టీజర్ కు సోషల్ మీడియా లో అద్భుతమైన స్పందన వస్తోంది. వరుణ్ తేజ్ చాలా చోట్ల మెగాస్టార్ చిరంజీవి గారి పోలిక లో ఉండటం ఫాన్స్ ని ఎంతో ఎక్సైట్ చేస్తోంది.


బాలీవుడ్ లో ఇటివలే ‘గబ్బర్' చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. భారీ వ్యవయంతో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

English summary
VarunTej's Kanche Chiranjeevi birthday special poster released.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu