»   » క్లీన్ U సర్టిఫికెట్ తో ఫిబ్రవరి 11‘వస్తాడు నా రాజు' ...

క్లీన్ U సర్టిఫికెట్ తో ఫిబ్రవరి 11‘వస్తాడు నా రాజు' ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు విష్ణు, తాప్సి హీరో హీరోయిన్లుగా, మంచు విష్ణు సతీమణి విరోనికా నిర్మాణంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందిన 'వస్తాడు నా రాజు' సినిమా హైదరాబాదులో సెన్సార్ పూర్తి చేసుకుంది. దీనికి క్లీన్ U సర్టిఫికేట్ లభించింది. హేమంత్ మధుకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు. కిక్ బాక్సర్ వెంకటప్ప నాయుడుగా విష్ణు ఇందులో నటిస్తున్నాడు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ గా పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. విష్ణు మరియు బ్రహ్మానందంల కామిడి సినిమాకి పూర్తి హైలైటెడ్ గా నిలుస్తాయి. ఫిబ్రవరి 11 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను, పాటలను యూరప్ లోని పలు దేశాలలో షూట్ చేసారు.

English summary
The Censor Board has given it a clean ‘U’ Certificate to Manchu Vishnu’s forthcoming film ‘Vastadu Naa Raju’. It is gearing up for its release on 11th February.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu