»   »  తల్లీ నువు షూటింగ్ కు రావద్దు?

తల్లీ నువు షూటింగ్ కు రావద్దు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
అమ్మా...తల్లీ నువు నాతో షూటింగ్ లకు రావద్దని ఆ హీరోయిన్ తన తల్లికి స్ట్రిక్ట్ గా చెబుతోంది. తల్లి వచ్చే సెక్యూరిటీగా ఉంటుంది కదా ఎందుకు వద్దంటోంది ఆమె అనే కదా మీ డౌట్. వివరాలలోకి వెళితే....ఆ హీరోయిన్ పేరు వేద. వేద షూటింగ్ లకు వెళ్లినపుడల్లా తల్లి వెంట వస్తోంది. ఇంతకుముందెపుడు తన తల్లిని షూటింగ్ లకు వద్దనలేదు కానీ ఈ మధ్య వేద తన తల్లిని షూటింగ్ రావద్దంటోంది. షూటింగ్ స్పాట్ లో దర్శకుడి దగ్గరి నుంచి లైట్ బాయ్ దాకా అందరూ అమె తల్లినే చూస్తున్నారట. చూసి ఎంజాయ్ చేస్తే సరిపోయేది కానీ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారట. కాంప్లిమెంట్స్ ఇస్తే వేదకు వచ్చిన ఇబ్బందేమనుకుంటున్నారా...ఉంది. వేద కన్నా తల్లే అందంగా ఉందని బహిరంగంగా అంటున్నారట. వేదకు అక్కలాగా ఉంటావని అంటున్నారట. ఈ వ్యాఖ్యలకు వేద తట్టుకోలేక పోతోందట. ఇబ్బందిగా ఫీలవుతోందట. అందుకే రావద్దని తల్లికి స్పష్టంచేసిందట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X