»   » అల్లు అర్జున్ ‘వేదం’ యుకెలో ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంటోందా...!

అల్లు అర్జున్ ‘వేదం’ యుకెలో ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంటోందా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'గమ్యం" వంటి ఉత్తమ చిత్రాన్ని అందించిన క్రిష్ కి దర్శకుడిగా రెండో సినిమా వరుస పరాజాయాల్లో వున్న అల్లు అర్జున్ కి ఊరటనివ్వాల్సిన సినిమా..మనోజ్ అనుష్కల చేరికతో మల్టీస్టార్ అనిపించుకుంటోన్న సినిమా...వేదం..ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా గురించి నెగెటివ్ టాక్ ప్రచారంలో వుంది. అయినా కూడా సినిమా బాగానే ఉండొచ్చన్న నమ్మకమూ జనాల్లో వుంది. ఈ నేపద్యంలో మన ఆంధ్రప్రదేశ్ లో కంటే ముందుగా యుకెలో 'వేదం" షో స్టార్ట్ అవనుంది కనుక ఈ సినిమా రిపోర్ట్ ఏంటో మీకు ముందుగానే తెలపాలనే ప్రయత్నమిది. తెరపై బొమ్మ పడకుండానే ఈ ఎటెంప్ట్ ప్లాప్ గా మిగిలింది. ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల షో కాస్తా క్యాన్సిల్ అయింది. 10పౌండ్స్(రూ.700/-) పెట్టి టికెట్ కొని ఎంతో ఆశగా 'వేదం" వీక్షించాలని వెళ్లిన ప్రేక్షకులు వెనుతిరిగారు. గతంలో ఎప్పుడూ ఏ సినిమాకీ ఇలాంటి అవాంతరం ఎదురవలేదంటూ నిట్టూర్సులు విడిచారు. మొత్తాని ఈ విధంగా అక్కడ ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంటోంది 'వేదం".

దట్స్ తెలుగులో వేదం రివ్వ్యూ....!

విశేషం ఏంటంటే ఈ సినిమా రిజల్ట్ గురించి మెగాభిమానులే కాదు..నందమూరి అభిమానులూ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ లో తన దాటికి సాటి రాగల సినిమా మరేదీ లేకపోవడంతో 'సింహా" రికార్డ్ స్థాయి కేంద్రాల్లో అర్ధశతదినోత్సవానికి పరుగులు తీస్తోంది. మరి 'వేదం" విజయవంతమై 'సింహా" జోరుని తగ్గించగలదేమోననే అంశం అంతటా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సో ఆ సస్పెన్స్ కి తెర దించేస్తూ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న 'వేదం" చిత్రం గురించి రిజల్ట్ పూర్తిగా తెలుసుకునేవరకూ రీఫ్రెష్ చూస్తూనే వుండండి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu