వీడియో: అంజలి కొత్త చిత్రం 'చిత్రాంగద' ట్రైలర్
హైదరాబాద్: వేగ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అంజలి హీరోయిన్ గా నటిస్తున్న 'చిత్రాంగద' చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు జి. అశోక్ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలిపారు. నిజ జీవిత కథ ఆధారంగా 'చిత్రాంగద'ను తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్‌లో పేర్కొన్నారు.
గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంజలితోపాటు సప్తగిరి, సింధు తొలాని, రక్ష, రాజా రవీంద్ర తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
'గీతాంజలి' వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం తర్వాత కథానాయిక అంజలి టైటిల్ పాత్రలో నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'చిత్రాంగద'. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై పిల్ల జమీందార్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రముఖ దర్శకుడు అశోక్.జి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


నిర్మాత గంగపట్నం శ్రీధర్ మాట్లాడుతూ..''గీతాంజలి తర్వాత అంజలికి పలు ఆఫర్లు వచ్చినా..దర్శకుడు అశోక్ చెప్పిన కథతో పాటు ఆయన ప్రతిభ మీద నమ్మకంతో అంజలి ఈ సినిమా అంగీకరించింది. ఎక్కడా రాజీపడకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. అమెరికాతో పాటు, బెంగళూర్, వైజాగ్, హైదరాబాద్‌లలోని పలు లోకేషన్‌లలో చిత్రీకరణ జరిపాము. బ్యాలెన్స్‌గా ఉన్న పాటను త్వరలోనే చిత్రీకరించనున్నాము. తప్పకుండా ఈ చిత్రం ఘనవిజయాన్ని సాధిస్తుందని నమ్మకం ఉంది..'' అన్నారు.
అంజలి, సింధుతులానీ, సప్తగిరి, రక్ష, రాజారవీంద్ర, జ్యోతి, సాక్షిగులాటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేష్; ఎడిటర్: ప్రవీణ్‌పూడి; కెమెరా: బాల్‌రెడ్డి;
నిర్మాత: గంగపట్నం శ్రీధర్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: అశోక్.జి


Click it and Unblock the Notifications











