»   » ధాయ్ ల్యాండ్ లో రెచ్చిపోయిన హీరోయిన్ (సెక్సీ స్నాప్స్)

ధాయ్ ల్యాండ్ లో రెచ్చిపోయిన హీరోయిన్ (సెక్సీ స్నాప్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బ్యాంకాక్,థాయ్ ల్యాండ్ సినిమావారికి స్వర్గం గా మారింది. అక్కడ షూటింగ్ చేయటం చాలా చాలా కామన్ గా మారింది. తెలుగులో బ్యాంకాక్ ని పాపులర్ చేసినట్లే ఇప్పుడు కన్నడంలో కూడా షూటింగ్ లకు ధాయ్ ల్యాండ్, బ్యాంకాక్ ప్రిఫర్ చేస్తున్నారు. అందుకోసం...దర్శక,నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు.


తాజాగా కన్నడ చిత్రం పరిశ్రమకు పరిచయమవుతున్న వీణా మాలిక్ తాజా చిత్రం షూటింగ్ ధాయ్ ల్యాండ్ లో జరిగింది. అక్కడ వీణా మాలిక్ తన దైన శైలిలో రెచ్చిపోయింది. ఆ ఫోటోలు ఇప్పుడు హాట్ హాట్ గా అంతటా స్ప్రెడ్ అవుతున్నాయి. కన్నడమూవీ 'సిల్క్ సక్కత హాట్ మగ' చిత్రం షూటింగులో బిజీగా ఉన్న పాక్ బ్యూటీ వీణా మాలిక్ అదరకొట్టింది. ఇక్కడ చిత్రీకరణ జరుగుతుండగా వీణా మాలిక్ గాయపడింది. అయినా దాన్ని కూడా పబ్లిసిటికి వాడుకుంది.

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈచిత్రంలో వీణామాలిక్ తన గ్లామర్ విశ్వరూపాన్ని చూపించబోతోంది. గతంలో ఇదే కాన్సెప్టులో హిందీలో రూపొందిన 'డర్టీ పిక్చర్' చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ తెగ డర్టీగా నటించి అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. కానీ ఇప్పుడు వీణా మాలిక్ విద్యా బాలన్ కంటే మరింత డర్టీగా నటిస్తూ సెన్సేషన్ సృష్టించడానికి రెడీ అవుతోంది.

ఈ సినిమాపై అక్కడ మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా డర్టీ ఫిక్చర్ ని ఖచ్చితంగా బీట్ అవుట్ చేస్తుందని నమ్మకంగా ఉన్నారు. దానికి తగినట్లు వీణామాలిక్ రోజుకోఫోటో షూట్ తో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెడుతోంది. ఆమె తాజాగా ధాయ్ ల్యాండ్ లో చేసిన సాంగ్ లో హాట్ షాట్స్ మీ కోసం ...

ఆ హాట్ హాట్ సీన్స్ ..స్లైడ్ షో లో ...

త్రిశూల్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని వెంకటప్ప నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు అక్షయ్ వీణామాలిక్ తో రొమాన్స్ చేస్తున్నాడు. సిల్క్ స్మిత సినీ జీవితం నుండి ఇన్ స్పైర్ అయి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇది హిందీలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘డర్టీ పిక్చర్'తో ఏ మాత్రం పోలిక ఉండదని అంటున్నారు దర్శక నిర్మాతలు.

వీణామాలిక్ ఈ చిత్రం షూటింగ్ లో పక్కా ప్రొఫెషనల్ గా వ్యవహించింది. అక్కడ ఆమె కాలికి దెబ్బ తగిలినా నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదు అన్నట్లు ఆమె పూర్తి స్ధాయిలో సహకరించింది. ఆమె రెస్ట్ తీసుకోవటానికి కూడా ఇష్టపడలేదని నిర్మాతలు చెప్తున్నారు. కంటిన్యూగా షూటింగ్ లో పాల్గొని నిర్మాతలకు సహకరించింది. ఆమె కాలికి తగిలిన దెబ్బతో డాక్టర్స్ పూర్తి స్ధాయి రెస్ట్ తీసుకోమని చెప్పారు. కానీ ఆమె డెడికేషన్ తో పాల్గొంది.

ఈ చిత్రంలోని ఈ పాటలో ఆమె కలర్ ఫుల్ బికినీల్లో కనిపించి వేడిక్కించనుంది. ఆమె అందచందాలే సినిమాకు యు.ఎస్ పి అని చెప్తున్నారు. సినిమా హైలెట్స్ లో ఇక్కడ తీసిన పాట ఒకటి అని దర్శకుడు చెప్తున్నారు. వీణా మాలిక్ కూడా ఈ చిత్రంపై చాలా కాన్పిడెంట్ గా ఉంది. బడ్జెట్ కు వెరవకుండా నిర్మాత సైతం ఈ చిత్రం నిర్మిస్తూండటంతో మంచి క్వాలిటీతో చిత్రం తయారవుతోందని చెప్తున్నారు.

వీణామాలిక్ మాట్లాడుతూ.. "నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. దెబ్బ తగిలినా నేను పాటను పూర్తి చేయగలిగాను. కొన్ని మూవ్ మెంట్స్ తో చాలా బాధగా అనిపించింది. అయినా పూర్తి చేయాలనే పట్టుదలతో చేసాను. నిజానికి ఇలా చేయటం చాలా కష్టం. అయినా నేను నిర్మాత సంక్షేమం ఆలోచించే నటిని ." అంటూ చెప్పుకొచ్చింది.


ఆమె కంటిన్యూ చేస్తూ ..." నన్ను నేను సూపర్ ఉమెన్ గా భావించుకోవటం లేదు. నేను కావాలనుకుంటే షూటింగ్ గ్యాప్ ఇచ్చి రాగలను కానీ..అది పద్దతి కాదు.. నేను కొన్ని పద్దతులు ఫాలో అవుతాను...నన్ను నమ్మి వచ్చిన దర్శక,నిర్మాతలను ఎప్పుడూ నిరాశపరచకూడదు...వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఈ షూటింగ్ పూర్తి కాగానే ది సిటీ దట్ నెవర్ స్లీప్స్ షూటింగ్ లో పాల్గొంటాను ." అంది.

వీణా మాలిక్ గాయం కారణంగా షూటింగ్‌కు కొన్ని గంటల పాటు విరామం ఇచ్చారు. ఆమె కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించారు. ప్రొడక్షన్ టీం సభ్యులు మాట్లాడుతూ....వీణా మాలిక్ సినిమా కోసం అంకిత భావంతో పని చేస్తుందని, ప్రమాద వశాత్తు ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు. అలాగే కో యాక్టర్స్ కూడా మాట్లాడుతూ..ఆమె తలచుకుంటే షూటింగ్ ఆగేది కానీ ఆమె తీసుకున్న నిర్ణయం తో షూటింగ్ ఏ సమస్యా లేకుండా పూర్తి అయ్యిందని చెప్పారు.

దెబ్బ తగలటంతో వేసిన బ్యాండేజ్ కనపడకుండా కెమెరామెన్ చాలా కవర్ చేస్తూ షూటింగ్ చెయ్యాల్సి వచ్చిందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. బ్యాండేజ్ తో ఉన్న కాలుని కెమెరాకు ఎక్సపోజ్ కాకుండా చూసుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని వీణా మాలిక్ చెప్తోంది. సెట్స్ తో ఆమె అంకితభావంతో పనిచేయటమే షూటింగ్ పూర్తి కావటానికి కారణం అని అందరూ ప్రశంసిస్తున్నారు.

ధాయ్ ల్యాండ్ చాలా బ్యూటిఫుల్ ల్యాండ్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతోంది వీణా. ఆమె మాట్లాడుతూ..తానూ ఇక్కడ షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేసానని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. " ధాయ్ ల్యాండ్ చాలా అందమైన ప్రదేసం. నాకు చాలా నచ్చింది. ఐ లవ్ ఇట్...ఇలాంటి చోట షూటింగ్ జరగటం నాకు చాలా ఆనందంగా ఉంది. "

ఈ సినిమా గురించి వీణా మాలిక్ మాట్లాడుతూ... సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అందులో తన పాత్రను మరచిపోరన్నారు. తాను హిందీ 'డర్టీ పిక్చర్‌'ను చూడలేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అయితే అందులో నటించిన విద్యాబాలన్‌ కంటే తన నటన ఇంకా గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు.

ఈ షూటింగ్ లో వీణామాలిక్ మీద తీసిన సెక్సీ స్నాప్స్ ఇప్పుడు ఇంటర్ నెట్ లో హాట్ గా మారాయి. ముఖ్యంగా ఈ సినిమా బిజినెస్ ని ఈ పోటోలు అమాంతం రెట్టింపు చేసాయి. దర్శక,నిర్మాతలు ఈ ఫీట్ తో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ధాయ్ ల్యాండ్ లో ఎంతోమంది షూటింగ్ చేసినా రాని క్రేజ్ ఆమెకు ఈ ఒక్క చిత్రంతో వచ్చింది అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

వీణా మాలిక్ నటిస్తున్న ‘సిల్క్ సక్కత్ హాట్ మగ' పెద్దలకు మాత్రమే పరిమితమైన A సర్టిఫికెట్ మూవీ. ఇప్పటికే విడుదలైన సిల్క్ సక్కత్ హాట్ మగ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు మరీ సెక్సీగా ఉండటంతో సెన్సార్ బోర్డు వాటికి కత్తెర వేసేందుకు రెడీ అవుతున్నారు.

వీణా మాలిక్ ఇప్పటి వరకు తన కెరీర్లో ఏ సినిమాలోనూ చేయని విధంగా సెక్సీగా ఈ చిత్రంలో రెచ్చిపోతోంది. ఒక రకంగా చెప్పాలంటో అందాల ఆరబోత, రొమాంటిక్ సీన్లలో హద్దులు దాటిందనే చెప్పొచ్చు. ఈ చిత్రం జులై నెలలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా కోసం శృంగార ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

English summary
Pakistani actress Veena Malik seems to be getting ready to set the screen on fire once again. This time, the hot and happening girl will be doing the magic in a Kannada film. The actress is making her debut in Kannada film industry with Silk Sakkath Hot Maga, a biopic on yesteryear sex siren Silk Smith. Continue reading the story on the slideshow along with some of the intimate photos of the lead stars...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu