»   » మరో బిడ్డకు జన్మనిచ్చిన హాట్ బ్యూటీ వీణా మాలిక్ (ఫోటో)

మరో బిడ్డకు జన్మనిచ్చిన హాట్ బ్యూటీ వీణా మాలిక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పాకిస్థాన్ నటి వీణా మాలిక్ గుర్తుందా? పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో ‘నగ్న సత్యం' చిత్రంలో నటించిన ఈ భామ తాజాగా దుబాయ్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దుబాయ్ బేస్డ్ బిజినెస్ మేన్ అసద్ బషీర్‌ను పెళ్లాడిన వీణా మాలిక్ గతేడాది సెప్టెంబర్లో అమెరికాలో మగబిడ్డకు జన్మనివ్వగా, సరిగ్గా ఏడాది తిరిగేలోగా మరో బిడ్డకు జన్మనివ్వడం గమనార్హం.

ఈ విషయాన్ని వీణా మాలిక్ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. తన కూతురుకు అమల్ అనే పేరు పెట్టినట్లు వెల్లడించింది. కొడుకు అబ్ రామ్, కూతురు అమల్...మా ఫ్యామిలీ సంపూర్ణంగా ఉంది అంటూ వీణా మాలిక్ తన మైక్రో బ్లాగింగ్ సైట్లో పేర్కొన్నారు.

Veena Malik Delivers A Baby Girl

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న వీణా మాలిక్ ఇకపై కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకంలో పూర్తిగా మునిగిపోనుంది. తాము కోరుకున్న విధంగా ఒక కూతురు, కొడుకు జన్మించడంతో వీణా మాలిక్ దంపతులు ఆనందంలో తేలియాడుతున్నారు.

వీణా మాలిక్ గురించిన విషయాల్లోకి వెళితే...‘బిగ్ బాస్' 4వ సీజన్ రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన వీణా మాలిక్ బాలీవుడ్లో సినిమా అవకాశాలు దక్కించుకుంది. జిందగీ 50-50, డర్టీ పిక్చర్(కన్నడ), సూపర్ మోడల్,‘ముంబై 125 కి.మీ' లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో నగ్న సత్యం అనే చిత్రంలో నటించింది.

English summary
Happiness has blessed Veena Malik once again as she gave birth to a baby girl in Dubai, her second child in two years. The first child was a boy. Veena, who was sporting a lot of controversies while in the show business, has now become a full time house maker and a mother.
Please Wait while comments are loading...