»   » తీవ్రంగా కొట్టాడు, అవమానించాడు... మౌనం వీడిన హీరోయిన్ !

తీవ్రంగా కొట్టాడు, అవమానించాడు... మౌనం వీడిన హీరోయిన్ !

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటి వీణా మాలిక్ తన భర్త అసద్ ఖట్టక్ తో విడాకులు తీసుకోవడంపై నోరు విప్పారు. భర్త తనను తరచూ తీవ్రంగా కొట్టడం, అవమానించడం లాంటివి చేస్తుండటం వల్లే గత్యంతరం లేక విడాకులు తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

ఒకటి రెండు సార్లు భరించాను. అతడి తీరు మారక పోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాను అని వీణా మాలిక్ తెలిపారు. అయితే తన భర్త అసద్ మళ్లీ కలిసుందామంటూ మత పెద్దల ద్వారా ప్రపోజల్స్ పంపుతున్నాడని, అతడి ప్రపోల్స్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

వెంట పడుతున్న భర్త

వెంట పడుతున్న భర్త

అయితే తాను నిరాకరిస్తున్నా... విడాకులు వెనక్కి తీసుకుందామని, మళ్లీ కలిసుందామని తన భర్త వెంట పడుతున్నాడని, తాను చేసిన పనికి క్షమించాలని కోరుతున్నాడని వీణా మాలిక్ తెలిపారు. వీణా మాలిక్ తీరు చూస్తుంటే మళ్లీ భర్త వద్దకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

తట్టుకోలేక పోయింది

తట్టుకోలేక పోయింది

ఇంతకాలం సినీ నటిగా సెలబ్రిటీ హోదా అనుభవించిన వీణా మాలిక్ భర్త తనపై చేయిచేసుకోవడం, అవమానాలకు గురి చేయడం తట్టుకోలేక పోయింది. అతడికి విడాకులు ఇచ్చేసి మళ్లీ తాను ఇష్టపడే సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకుంది.

 డబ్బు కోసం కాదు

డబ్బు కోసం కాదు

డబ్బు కోసమే అసద్ నుండి తాను విడాకులు తీసుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వీణా మాలిక్ ఖండించింది. అతడు తనపై గృహ హింసకు పాల్పడటం వల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

నాలుగేళ్ల కాపురం

నాలుగేళ్ల కాపురం

వీణా మాలిక్ 2013లో అసద్ ఖటాక్ ను పెళ్లాడి సినిమాలకు దూరమైంది. నాలుగేళ్ల కాపురం అనంతరం విబేధాలతో అతడితో విడిపోయి మళ్లీ సినిమా రంగంలోకి వస్తోంది.

ఇద్దరు పిల్లలు

ఇద్దరు పిల్లలు

నాలుగేళ్ల గ్యాపులో ఈ దంపతులు ఓ పాపకు, బాబుకు జన్మనిచ్చారు. మళ్లీ భర్త నుండి కలిసుందామనే ప్రపోజల్స్ వస్తుండటంతో పిల్లల కోసమైనా ఆమె తిరిగి వెళ్లే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

విడాకుల తర్వాత.... సెక్సీగా చెలరేగిపోతున్న హాట్ బ్యూటీ

విడాకుల తర్వాత.... సెక్సీగా చెలరేగిపోతున్న హాట్ బ్యూటీ

విడాకుల తర్వాత వీణా మాలిక్ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి అందరికీ తెలిసేలా ఓ సెక్సీ వీడియోను కూడా రిలీజ్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Veena Malik has divorced her husband Asad Khattak and the actress opened up about how her husband used to beat her up and disrespected her all these days. She said in an interview, "First, that he (Asad Khattak) beat me; second, that he disrespected me... not once, but repeatedly."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu