»   » బిజినెస్‌మేన్‌ను పెళ్లాడబోతున్న వీణా మాలిక్!

బిజినెస్‌మేన్‌ను పెళ్లాడబోతున్న వీణా మాలిక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: తన హాట్ అండ్ సెక్సీ అందాల ప్రదర్శనతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న పాకిస్థానీ బ్యూటీ వీణా మాలిక్ పెళ్లికి సిద్ధమవుతోంది. ఉమర్ ఫరూఖ్ అనే వ్యాపార వేత్తను ఆమె త్వరలో పెళ్లాడబోతోంది. వీణా మాలిక్-ఉమర్ ఫరూక్ ఈ సంవత్సరం మార్చి నెలలో తొలిసారిగా ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా దుబాయ్‌లో కలుసుకున్నారు.

తొలి పరిచయంలోనే ఇద్దరు దగ్గరయ్యారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. తరచూ కలసుకుంటూ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. పెళ్లి ప్రస్తావన మొదట ఉమర్ తెచ్చారని, వీణా కూడా ఆయన అందకు సముఖంగా స్పందించడంతో వీరి పెళ్లి విషయం ఖరారైనట్లయింది.

2015లో వీరి వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. త్వరలో వీరి పెళ్లికి సంబంధించిన ఫార్మల్ అనౌన్స్ మెంట్ వెలువడనుంది. ప్రస్తుతం వీణా పలు సినిమాలకు కమిటైన సంగతి తెలిసిందే. పెళ్లి నాటికి తన కమిట్ మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి...పెళ్లి కోసం కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వీణా మాలిక్ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఆమె నటించిన హిందీ చిత్రాలు 'ముంబై 125 కి.మీ 3డి', 'ద సిటీ దట్ నెవర్ స్లీప్స్', 'మిస్టర్ మనీ', తెలుగు చిత్రాలు రంగీలా, నగ్నసత్యం విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కాటేజ్ నెం.9, దిల్ నె దిల్ కో పుకారా చిత్రాల్లో వీణా మాలిక్ నటిస్తోంది.

English summary

 Veena Malik was spotted a few days ago at the Mumbai Airport, just back after receiving an award. The star was beaming, talking on the phone with someone. The reason for her happiness is that Veena may get married to her businessman boyfriend Umar Farooq soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X