»   » వాడుకుంది, బెదిరిస్తోంది: హీరోయిన్‌పై మాజీ బాయ్‌ఫ్రెండ్ కేసు

వాడుకుంది, బెదిరిస్తోంది: హీరోయిన్‌పై మాజీ బాయ్‌ఫ్రెండ్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హీరోయిన్, పాకిస్థాన్ నటి వీణా మాలిక్‌పై ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఫోన్ ద్వారా వీణా మాలిక్ తనను బెదిరిస్తోందని, వేధింపులకు గురి చేస్తోందని, శనివారం ఆమె నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ప్రశాంత్ సింగ్ ఫిర్యాదు అందుకున్న ముంబైలోని ది ఆరే కాలనీ పోలీసులు వీణా మాలిక్‌పై కేసు నమోదు చేసారు. ఆమెపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 507 కింద కేసు నమోదు చేసారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.....ప్రశాంత్ సింగ్ వీణా మాలిక్ బాయ్ ఫ్రెండ్ అని, ఆమె తన వృత్తి నిమిత్తం ముంబై వచ్చినపుడు ఇద్దరూ కలిసే ఉన్నారని తెలిపారు.

సీనియర్ పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ ఉత్తమ్ తెలిపిన వివరాల ప్రకారం...'మూడు రోజుల క్రితం వీణా మాలిక్ అసద్ ఖాన్ అనే వ్యక్తిని దుబాయ్‌లో పెళ్లాడి సౌదీ అరేబియాలో సెటిలైంది. తమ పెళ్లి విషయం మీడియాకు సింగ్ లీక్ చేయడంపై వీణా మాలిక్ అప్ సెట్ అయింది' అని తెలిపారు.

సింగ్ చెప్పిన వివరాల ప్రకారం....'శనివారం వీణా మాలిక్ ప్రశాంత్ సింగ్‌కు ఫోన్ చేసింది. బెదిరింపులకు పాల్పడింది. మనుషులను పంపి చంపిస్తానని బెదిరించింది' అని స్పష్టం అవుతోంది. వీణా మాలిక్ తనతో రెండు సంవత్సరాలు కలిసి ఉందని, తన అవసరాల కోసం నన్ను వాడుకుందని ప్రశాంత్ సింగ్ వాపోయాడు.

English summary
Veena Malik’s ex-boyfriend Prashant Singh has registered a complaint against her for allegedly abusing and threatening him over telephone on Saturday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu