»   » వ్యాపారిని పెళ్లాడిన వివాదాస్పద నటి వీణామాలిక్

వ్యాపారిని పెళ్లాడిన వివాదాస్పద నటి వీణామాలిక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇస్లామాబాద్: వివాదాస్పద పాకిస్థాన్ నటి వీణా మాలిక్ ఓ వ్యాపార వేత్తను దుబాయ్‌లో పెళ్లాడింది. ఈ మేరకు పాకిస్థాన్ మీడియా ఇందుకు సంబంధించిన వార్తలను పబ్లిష్ చేసింది. 29 ఏళ్ల వీణామాలిక్, అసద్ బషీర్ ఖాన్ ను దుబాయ్‌లోని ఓ కోర్టులో పెళ్లాడినట్లు పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్ ఛానల్ వెల్లడించింది. ఇద్దరు వెడ్డింగ్ రింగ్స్ మార్చుకున్న దృశ్యాలను సదరు ఛానల్ ప్రసారం చేసింది.

అసద్ బషీర్ ఖాన్ దుబాయ్, యూఎస్‌లో పలు వ్యాపారానలు నిర్వహిస్తున్నాడు. వీణా మాలిక్ తండ్రి, అసద్ బషీర్ ఖాన్ తండ్రి స్నేహితులు. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, ఒకరిపై ఒకరు మనసు పడి పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా వీణా మాలిక్ సినిమా రంగంలో కొనసాగుతుందని సమాచారం.

Veena Malik weds businessman in Dubai

పెళ్లి తర్వాత వీణా మాలిక్ కోర్టు బయట మీడియాతో మాట్లాడింది. 'ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్న గర్ల్ నేనే. ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం' అంటూ వీణా మాలిక్ తన మనసులోని మాటను బయట పెట్టింది.

పెళ్లి విషయాలపై ఎక్కువగా మాట్లాడటానికి వీణా మాలీక్ నిరాకరించింది. త్వరలోనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయని మాత్రమే వ్యాఖ్యానించింది. అమెరికాలో వైట్ వెడ్డింగ్ జరుపుకుందామని తన భర్త మాట ఇచ్చాడని వీణా మాలిక్ వెల్లడించింది. అసద్ మాట్లాడుతూ....తమ పేరెంట్స్ వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరారని, దుబాయ్, యూఎస్, పాకిస్థాన్ లో తమ పెళ్లి ఫంక్షన్స్ జరుగుతాయని తెలిపారు.

English summary
Controversial Pakistani actress Veena Malik today tied the knot with a businessman in Dubai, according to a media report. The 29-year-old actress, best known in India for her appearance in 'Bigg Boss', and businessman Asad Bashir Khan Khattak, were married in a court in Dubai, Geo News channel reported.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu