ఈ ఫోటోలు చూశారా?... ‘బాహుబలి’ని కాపీ కొట్టారు, ఎన్టీఆర్ మూవీ సీన్ కూడా!
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి', 'బాహుబలి-2' చిత్రాలు భారత దేశ సినీ చరిత్రలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రూ. 1000 కోట్లు వసూలు చేసిన తొలి ఇండియన్ చిత్రంగా ఇది రికార్డుల కెక్కింది. కాగా... బాహుబలిని కాపీ కొడుతూ భోజ్‌పురిలో ఓ సినిమా రాబోతోంది.

కాపీ కొడుతున్నారా? రీమేకా?
భోజ్‌పురిలో ‘వీర్ యోధ మహాబలి' పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. భోజ్‌పురి నటుడు దినేష్ లాల్ యాదవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇక్బాల్ భక్ష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబలి సినిమాకు రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇది రీమేక్ సినిమా అని అఫీషియల్ ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు.

హక్కులు దక్కించుకున్నట్లు ప్రచారం
తాను బాహుబలి సినిమా హక్కులు దక్కించుకున్నట్లు దినేష్ లాల్ యాదవ్ ప్రచారం చేసుకుంటున్నారట. ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా మాధ్య మాల్లో సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు.

బాహుబలిని ఉన్నది ఉన్నట్లు దించేస్తున్నారు
ఆ ఫోటోలు చూస్తుంటే బాహుబలి సినిమాను సీన్ టు సీన్ కాపీ కొడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మహారాష్ట్రలోని ఓ విలేజ్ లో జరుగుతోంది.
జనవరిలో టీజర్
ఈ చిత్రంలో దినేష్ లాల్ యాదవ్ తో పాటు హీరోయిన్ ఆమ్రపాలి దూబె నటిస్తోంది. జనవరి 15న టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ టీజర్ విడుదలైన తర్వాత సినిమా గురించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

జై లవ కుశ సీన్ కాపీ
దినేష్ లాల్ యాదవ్ హీరోగా తెరకెక్కుతున్న ‘సౌగంధ్' అనే సినిమా త్వరలో రాబోతోంది. అందులో ఈ సీన్ ఉంది. ఈ సీన్ మన తెలుగు మూవీ ‘జై లవ కుశ' సినిమాలోనిది. చేతిలో గొడ్డలితో సహా ఉన్నది ఉన్నట్లు కాపీ కొట్టారు.


Click it and Unblock the Notifications











