»   » టాలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. మూడు రోజుల ముందే వీర‌భోగ వ‌సంత రాయ‌లు!

టాలీవుడ్ చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. మూడు రోజుల ముందే వీర‌భోగ వ‌సంత రాయ‌లు!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Veera Bhoga Vasantha Rayalu To Release On October 26th

  నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీయ స‌ర‌న్, శ్రీ‌విష్ణు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న వీరభోగ వ‌సంత రాయ‌లు అక్టోబ‌ర్ 26న విడుద‌ల కానుంది. ఈ చిత్ర ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌ను ఫ్లైహై సినిమాస్ సొంతం చేసుకుంది. ఆస‌క్తిక‌రంగా ఈ చిత్ర ప్రీమియ‌ర్స్ ను ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్లు విడుద‌ల‌కు ఏకంగా మూడు రోజుల ముందే ప్లాన్ చేస్తున్నారు. ఇలా మూడు రోజుల ముందే ప్రీమియర్లను ఏర్పాటు చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినిమాపై ఉన్న నమ్మకంతోనే చిత్ర యూనిట్ ధైర్యం చేస్తుందనే మాట వినిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

   దేశభక్తి నేపథ్యంతో క్రైమ్ థ్రిల్లర్‌గా

  దేశభక్తి నేపథ్యంతో క్రైమ్ థ్రిల్లర్‌గా

  ఇక వీర‌భోగ వ‌సంత రాయలు విష‌యానికి వ‌స్తే.. ఇది ఒక దేశ‌భ‌క్తి నేపథ్యంగా సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్. ఈ చిత్రాన్ని ఇంద్ర‌సేన తెర‌కెక్కించారు. ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. మార్క్ కే రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. బాబా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై అప్పారావ్ బెల్ల‌న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

   ఆసక్తికరంగా సినిమా టైటిల్

  ఆసక్తికరంగా సినిమా టైటిల్

  బాబా క్రియేషన్ బ్యానర్ పై అప్పారావు బల్లెన నిర్మిస్తోన్న వీరభోగ వసంత రాయులు అనే టైటిల్ ఇంప్రెసివ్‌గా ఉందనే మాట వినిపిస్తున్నది. ఆసక్తికరంగా ఉన్న టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

   అక్టోబ‌ర్ 23నే యూఎస్ ప్రీమియ‌ర్స్

  అక్టోబ‌ర్ 23నే యూఎస్ ప్రీమియ‌ర్స్

  ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్న‌డూ జ‌ర‌గ‌ని విధంగా అక్టోబ‌ర్ 23నే యూఎస్ ప్రీమియ‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్‌కు సంబంధించిన ఓవ‌ర్సీస్ బిజినెస్‌లో ఫ్లైహై సినిమాస్ చాలా వేగంగా దూసుకెళ్తున్నది. ఇటీవల విడుదలైన దేవ‌దాస్ సినిమాను భారీ సెంటర్లలో ఈ సంస్థే విడుద‌ల చేసింది.

   అక్టోబర్ 26న భారీగా రిలీజ్

  అక్టోబర్ 26న భారీగా రిలీజ్

  గ్రాండ్ ప్రమోషన్స్ మధ్య అక్టోబర్ 26న భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నది. వీరభోగ వసంతరాయలు చిత్రం నారా రోహిత్, శ్రీ విష్ణు, సుధీర్ బాబు, శ్రీయ కేరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందనే మాట వినిపిస్తున్నది. కొద్ది రోజులు ఆగితే ఈ సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకొంటుందో తెలియడం ఖాయం.

  English summary
  Veera Bhoga Vasantha Rayalu starring Nara Rohith, Sudheer Babu, Shriya Saran and Sree Vishnu in the lead roles, is all set for a grand release on October 26th. The overseas distribution rights of the film have been bagged by FlyHigh Cinemas. Interestingly, the distributors have planned the premiere shows of the film three days in advance i.e, on October 23rd which has never happened before in Telugu cinema.FlyHigh Cinemas, a rising distributor in the overseas market which has distributed movies like ‘Devadas,’ in the recent times and is excited to secure USA rights.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more