»   » కాటమరాయుడు బాలీవుడ్ రీమేక్: పవన్ కి ధీటుగా అతను కనిపించగలడా?

కాటమరాయుడు బాలీవుడ్ రీమేక్: పవన్ కి ధీటుగా అతను కనిపించగలడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అజిత్‌ 'వీరమ్‌' చిత్రానికి రీమేక్‌గా 'కాటమరాయుడు' వచ్చింది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించారు. ఇప్పుడు చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.ఈ రీమేక్‌లో పవన్‌ కల్యాణ్‌ పాత్రలో అక్షయ్‌కుమార్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. సాజిద్‌, ఫర్హాద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

హిందీ రీమేక్‌లో

హిందీ రీమేక్‌లో

తమిళంలో అజిత్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘వీరమ్‌'.తన సోదరులతో గ్రామంలో నివసించే వ్యక్తి కథ ఇది. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో అక్షయ్‌కుమార్‌ నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. సాజిద్‌ నదియాడ్‌వాలా ‘వీరమ్‌' హిందీ హక్కులను సొంతం చేసుకున్నారు.


అక్షయ్‌ లుంగీ గెటప్‌లో

అక్షయ్‌ లుంగీ గెటప్‌లో

ఆయన నిర్మాణంలోనే ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా మొత్తంలో అక్షయ్‌ లుంగీ గెటప్‌లోనే కన్పించనున్నాడట. అక్షయ్‌ ''హాలిడే'' తర్వాత ఎలాంటి దక్షిణాది రీమేక్‌ చిత్రంలో నటించలేదు. ఈ సినిమాతో అభిమానులు అక్షయ్‌ని మరోసారి రీమేక్‌ చిత్రంలో చూడగలుగుతారని చిత్రబృందం వెల్లడించింది.


టాయిలెట్ సంచలన విజయం

టాయిలెట్ సంచలన విజయం

భిన్నమైన సినిమాలతో బాలీవుడ్ లో ఖాన్ హీరోలతో పోటీగా దూసుకుపోతున్న అక్షయ్ కుమార్ లేటెస్ట్ సినిమా టాయిలెట్ సంచలన విజయం సాదించింది. ఈ నేపథ్యంలో ఆయన కాటమరాయుడు రీమేక్ పై దృష్టి పెట్టాడు. ఇప్పటికే క్రేజీ రేటుకు ఈ సినిమా రీమేక్ హక్కులు తీసుకున్నారని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది అని తెలుస్తోంది.


ప్యాడ్‌మెన్‌

ప్యాడ్‌మెన్‌

మరి కాటమరాయుడిగా అక్షయ్ బాలీవుడ్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. తాజాగా అక్షయ్‌ తన సతీమణి ట్వింకిల్‌ ఖన్నా ప్రొడక్షన్‌లో ‘ప్యాడ్‌మెన్‌'లో నటిస్తున్నారు. ‘వీరమ్‌'.. తెలుగులో పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా ‘కాటమరాయుడు' పేరుతో రీమేక్‌ అయిన విషయం తెలిసిందే.English summary
It is now speculated that Akshay Kumar will be acting in the Hindi remake of Veeram, and it will be titled as Land of Lungi. If the rumours are anything to go by, director Farhad Samji will helm the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu