»   » వర్మ తీసిన మరో ‘వీరప్పన్’ (ట్రైలర్ అదిరింది)

వర్మ తీసిన మరో ‘వీరప్పన్’ (ట్రైలర్ అదిరింది)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడలో 'కిల్లింగ్ వీరప్పన్' పేరుతో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ వీరప్పన్ ను చంపే పోలీసాఫీసర్ పాత్రలో నటించగా, సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్రను పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం దక్షిణాదిన మంచి విజయం సాధించింది.

అయితే ఇదే చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయకుండా...'వీరప్పన్-నన్ లైక్ హిమ్ నెవర్ ఎగ్జిస్టెడ్' పేరుతో మళ్లీ వేరుగా సినిమాను చిత్రీకరించారు. వీరప్పన్ పాత్ర పోషించిన సందీప్ భరద్వాజ్ మినహా...మిగతా పాత్రల్లో బాలీవుడ్ నటులతో తీసారు. ఇందులో వీరప్పన్ ను చంపే పోలీసాఫీసర్ పాత్రలో సచిన్ జోషి, వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి పాత్రలో ఉషా జాదవ్, వీరప్పన్ ను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించే అమ్మాయి పాత్రలో లీసారే నటించారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది.

సౌత్ లో వర్మ తెరకెక్కించిన 'కిల్లింగ్ వీరప్పన్' కంటే హిందీ 'వీరప్పన్' విజువల్స్ పరంగా మరింత క్వాలిటీగా ఉంటుందని, చిత్రీకరణ కూడా సౌత్ వెర్షన్ కంటే డిపరెంటుగా తీసారని ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. మే 27న హిందీలో ఈచిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా గురించి వర్మ ఆ మధ్య మాట్లాడుతూ....దక్షిణ భారతదేశంలో "కిల్లింగ్ వీరప్పన్" అనే సినిమా పెద్ద హిట్ అయ్యినప్పటికి... నేను బలంగా అనుకునేదేంటంటే ఉత్తర భారతదేశంలోను అలాగే వేరే దేశాల్లో ఉన్న ప్రజలు ఈ చిత్రం చూసి అసంతృప్తి చెందుతారు. ఎందుకంటే దక్షిణంలో లాగా వీరప్పన్ గురించి వారికి పెద్దగా తెలియదు కాబట్టి. నేను వీరప్పన్‌కి సంబంధించిన పూర్తి కథని "కిల్లింగ్ వీరప్పన్" చూసిన ఒక దుబాయ్ బిజినెస్‌మెన్‌కి చెప్పినప్పుడు అతను ఆశ్చర్యానికి లోనయ్యాడు. అతను ఖచ్చితంగా ఈ చిత్రం అంతర్జాతీయస్థాయిలో ఒక "జీవిత చరిత్రలా" తియ్యాలి కానీ వీరప్పన్‌ని చంపటం అన్న ఒక్క విషయం మీదే చిత్రం పరిమితం కాకూడదని చెప్పాడు. అతను తనతో పాటు వున్న ఒక అమెరికన్ పార్టనర్ కలిసి వీరప్పన్ జీవిత చరిత్ర మీద నాతో ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వాళ్ళు నాకు పెట్టిన ఒకే ఒక షరతు ఈ చిత్రాన్ని నిర్మించే క్రమంలో నేను ఖర్చుకు వెనుకాడకుండా రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించాలని కోరారు.

అందుకనే అంతర్జాతీయస్థాయిలో ఈ వీరప్పన్ చిత్రం మళ్ళీ పూర్తిగా మొదటి నుండి చాలామంది సరికొత్త నటులతో రిషూట్ చేస్తున్నాం. ఇది జీవిత చరిత్ర కావటం వల్ల కేవలం అతని చావుకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా, వీరప్పన్ ఎదుగుదల వెనుకనున్న కథను అలాగే స్పెషల్ టాస్క్ ఫోర్సు అండ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులల్లో వైఫల్యం చెందారో చెప్పి ... తరువాత వీరప్పన్ చావు వెనక వున్న అత్యంత భీకరమైన వ్యూహరచనని చెప్పదలుచుకున్నాను.

Veerappan Official Trailer

నేను తీయబోయే కొత్త వీరప్పన్ చిత్రంలోని కొన్ని దృశ్యాలు BSF సిబ్బంది విమానాల్లో నుండి లాండ్ అయ్యి అక్కడ నుండి కాన్వాయ్ ట్రక్కుల్లో అడవిలోని వివిధ ప్రదేశాల్లోకి ప్రయాణించడం అలాగే అసెంబ్లీ మరియు పార్లమెంట్ లలో వీరప్పన్‌ని పట్టుకోవటంలో వైఫల్యం చెందుతున్న అంశంపై వేడి పుట్టించే చర్చలు చూపించడం... అంతేకాకుండా విదేశి జర్నలిస్టులు వీరప్పన్‌పై రిసెర్చ్ చేయటానికి, పుస్తకాలు రాయటానికి తరలిరావటం లాంటివి కూడా వుంటాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఈ చిత్రంలోని ఎక్స్‌ట్రీమ్ రియలిస్టిక్ ఎట్ట్మస్-ఫియర్ భారీ బడ్జెట్ల హాలీవుడ్ చిత్రాలని తలపించేలా వుంటుంది అన్నారు.

ఈ చిత్రంలోని మెకానికల్ ఎఫెక్ట్స్ కోసం అలాగే రియలిస్టిక్‌గా కనిపించే కంప్యూటర్ గ్రాఫిక్స్‌పై పనిచేయటానికి కొంతమంది విదేశి టెక్నిషియన్స్‌ని పిలిపించడం జరుగుతుంది. చివరి మాటగా వీరప్పన్ జీవిత చరిత్ర మీద నిర్మించబోయే ఈ నా కొత్త ఇంటర్నేషనల్ చిత్రం నా కెరియర్‌లో అంత్యంత ప్రత్యేకమైంది ... ఎందుకంటే వీరప్పన్ అనే కారక్టేరే అత్యంత ప్రత్యేకమైంది అని వర్మ తెలిపారు.

English summary
Official Trailer of most awaited Hindi movie of 2016 'Veerappan' released. A film by Ram Gopal Varma. Movie stars Sandeep Bhardwaj, Sachiin J Joshi, Usha Jadhav & Lisa Ray. It took 10 years to kill Osama Bin Laden and 20 years to kill Veerappan. No villain like Veerappan ever existed. Striking Cinemas 27th May 2016
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu