twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మకు మరో వీరప్పన్ షాక్....

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ సినిమా 'కిల్లింగ్ వీరప్పన్' ఇపుడు ఈ సినిమా అన్ని లీగల్ సమస్యలను, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 1న విడుదలకు సిద్దమవుతోంది. 15 సంవత్సరాల పాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన వీరప్పన్‌కు ఓ పోలీస్ అధికారి ఎలా చెక్ పెట్టాడు, అతన్ని పట్టుకోవడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేసాడు, చివరకు అతన్ని ఎలా మట్టుపెట్టాడు అనేది అసలు స్టోరీ. ఈ చిత్రంలో ఒకప్పుడు వీరప్పన్ చేతిలో కిడ్నాప్ అయిన కన్నడ సీనియర్ నటుడు రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు.

    ఈ సినిమాపై వర్మ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఉన్నట్టుండి వర్మకు మరో వీరప్పన్ షాకిస్తున్నాడు. 2013లో సౌత్ యాక్షన్ హీరో అర్జున్, కిషోర్ ప్రధాన పాత్రల్లో వీరప్పన్ జీవితంపై తీసిన చిత్రాన్ని ఇపుడు తెలుగులో జనవరి 1వ తేదీనే ‘వీరప్పన్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం గతంలోనే తెలుగులో విడుదలైంది. ఇపుడు మరోసారి విడుదల చేస్తున్నారు. వర్మ చేస్తున్న ప్రచారం తమ సినిమాకు కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇందులో అర్జున్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా వీరప్పన్ పాత్రలో కిషోర్ నటించాడు.

    Veerappan Vs Killing Veerappan

    అయితే వర్మ మాత్రం ఈ విషయంలో పెద్దగా వర్రీ కావడం లేదట. తన సినిమానే ప్రేక్షకులు చూస్తారనే నమ్మకంతో ఉన్నారు. తన సినిమా 'కిల్లింగ్ వీరప్పన్'ను మొట్టమొదట పోలీసులకే చూపిస్తానని, దానికి వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని తనకు చాలా ఉత్సుకతగా ఉందని దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పారు. తన సినిమా గురించిన విశేషాలను ఆయన ట్వీట్ చేశారు. ఒక పోలీసు అధికారికి పుట్టిన ఆలోచన వల్లే వీరప్పన్ హతమయ్యాడని, ఆ అధికారికి సంబంధించిన కథే 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా అని వర్మ తెలిపారు. 1200 మంది పోలీసులు కలిసి కూడా 15 ఏళ్ల పాటు వీరప్పన్‌ను పట్టుకోలేకపో యారని, భారత దేశ నేరచరిత్రలో పోలీసు శాఖ అతిపెద్ద వైఫల్యం అదేనని కూడా వర్మ వ్యాఖ్యానించారు.

    ''చరిత్రలోనే వీరప్పన్‌ ఓ అరుదైన వ్యక్తి. వీరప్పన్‌ కథని సినిమాగా తీయడానికి చాలా పరిశోధన చేశాను. అతని భార్య ముత్తులక్ష్మిని కలుసుకొని కొన్ని విషయాలు సేకరించాను. వాటన్నింటిని క్రోడీకరించి తీసిన సినిమా ఇది. వీరప్పన్‌ తిరిగిన ప్రాంతాల్లోనే షూటింగ్ జరిపాము'' అని వర్మ అంటున్నారు. ''వీరప్పన్ చరిత్రను తెరకెక్కించాలని చాలా సంవత్సరాలుగా ఆసక్తిగా ఉన్నా. ఆయన్ను పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. చంపడానికి పోలీసులకు 20 ఏళ్లు పట్టింది. వీరప్పన్‌ను చంపడం అనే పాయింట్‌తో సినిమా తీసేందుకు చాలాకాలం పరిశోధన చేశా'' అని రామ్‌గోపాల్ వర్మ అన్నారు. ''వీరప్పన్ లైఫ్‌లో చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఇది ఆయనకు సంబంధించిన బయోపిక్ కాదు. ఈ చిత్రాన్ని రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. 'ఆపరేషన్ కుకూన్'లో పాల్గొన్న వ్యక్తులను, వీరప్పన్ భార్య ముత్తులక్ష్మీని కలిసి సమాచారం సేకరించా. వీరప్పన్ చేతిలో కిడ్నాప్ అయిన కన్నడ నటుడు రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్‌కుమార్ ఈ చిత్రంలో నటిస్తే యాప్ట్ అవుతాడని ఎంచుకున్నా. '' అని చెప్పారు.

    English summary
    Cinema is a bigger scale of product than the brand of Ram Gopal Varma. In fact, cinema is a platform on which RGV is doing the business today and all the hard work done from his side with January 1st releasing ‘Killing Veerappan’ might get a setback in lower order centers if common audience are really informed with one film titled as ‘Veerappan’ releasing on the same day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X