»   »  గోపీచంద్ తో సినిమా చేయటం లేదని ఖండన

గోపీచంద్ తో సినిమా చేయటం లేదని ఖండన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ‘బిందాస్', ‘రగడ' లాంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన వీరూ పోట్లకి ఎందుకనో సరైన బ్రేక్ రాలేదు. విషయమున్న మంచి రచయిత గా ప్రూవ్ చేసుకున్న ఆయన దర్శకుడుగానూ తనేంటో నిరూపించుకున్నరు. అయితే కాంబినేషన్స్, హీరోలు సెట్ కాక అలా ఖాళీగా ఉండిపోతున్నారు. 2013లో విష్ణుతో చేసిన ‘దూసుకెళ్తా' సినిమా తరువాత తిరిగి ఏ ప్రాజెక్టూ ప్రారంభించలేదు. అయితే ఈ దర్శకుడు తన తదుపరి సినిమా గోపీచంద్ తో వుంటుందని కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి.

 Veeru Potla not directing Gopichand

ఈ పుకార్లను ఖండిస్తూ వీరుపోట్లా తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ వార్తలో నిజంలేదని తెలిపాడు. తన తదుపరి చిత్ర వివరాలు ఇంకా ఖరారు కాలేదని అధికారిక ప్రకటన కోసం కొన్నిరోజులు ఆగాల్సిందేనని తెలిపాడు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇదేకాక వీరుపోట్ల విక్టరీ వెంకటేష్, రవితేజల కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ డైరెక్ట్ చెయ్యాల్సివుండగా కొన్ని కారణాల వలన అది ఆగిపోయినట్టు తెలుస్తుంది. తాజాగా సక్సెఫుల్ కాంబినేషన్ అయిన వీరు పోట్ల - మనోజ్ కాంబినేషన్లో బిందాస్ 2 అనే సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై మంచు విష్ణు నిర్మించనున్నాడు. ఇదే విషయాన్ని నిన్న జరిగిన దూసుకెళ్తా ఆడియో ఫంక్షన్ వేడుకలో తెలియజేసారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.

English summary
Couple of days back rumours spread that Veeru Potla who scored a hit with Vishnu with ‘Doosukeltha’ will be directing Gopichand. However Veeru Potla on social media clarified on the project. He tweeted, ‘Me doing a project with Hero Gopichand is not true, nothing has been finalized yet’.
Please Wait while comments are loading...