»   » సమంత ఫొటో వైరల్.. వేలైక్కరన్ ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్.. నయనతార, శివకార్తీకేయన్ ఇంకా..

సమంత ఫొటో వైరల్.. వేలైక్కరన్ ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్.. నయనతార, శివకార్తీకేయన్ ఇంకా..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  భారీ తారాగాణంతో ప్రతిష్థాత్మకంగా తెరకెక్కుతున్న వేలైక్కరన్ చిత్రం దక్షిణాది చిత్ర పరిశ్రమను విశేషంగా ఆకర్షిస్తున్నది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో శివకార్తీకేయన్, నయనతార, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, సమంత, ప్రకాశ్ రాజ్, స్నేహ, తంబీ రామయ్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ చాలా ఆసక్తిని రేపుతున్నాయి.

  ఆహార పదార్థాల కల్తీపై పోరాటం

  ఆహార పదార్థాల కల్తీపై పోరాటం

  ఆహార పదార్థాల కల్తీపై ఓ యువకుడు సాగించిన పోరాటం సాగించిన యువకుడి కథా నేపథ్యంగా వేలైక్కరన్ చిత్రం రూపొందుతున్నది. దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు నటించడంతో ఈ సినిమా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకొన్నది.

  Samantha Evergreen Spicy Hot Photo Stills
  పవర్‌ఫుల్ పాత్రలో నయనతార

  పవర్‌ఫుల్ పాత్రలో నయనతార

  ఇటీవల దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నయనతార ఓ పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారని వెల్లడించారు. కల్తీ ఆహార ముఠాకు వ్యతిరేకంగా పోరాడే పాత్రలో శివకార్తీకేయన్ నటిస్తున్నారని తెలిపారు.

  తొలిసారి శివకార్తీకేయన్, నయనతార జోడి

  తొలిసారి శివకార్తీకేయన్, నయనతార జోడి

  వేలైక్కరన్ చిత్రంలో నయనతార పాత్ర పేరు మృణాళిని, శివకార్తికేయన్ పాత్ర పేరు అరివు అని మోహన్ రాజా చెప్పారు. ఈ చిత్రం కోసం నయనతార, శివకార్తీకేయన్ తొలిసారి జతకట్టారనే విషయాన్ని ఆయన పేర్కొన్నారు.

  ప్రత్యేక పాత్రలో మహేశ్ మంజ్రేకర్

  ప్రత్యేక పాత్రలో మహేశ్ మంజ్రేకర్

  వేలైక్కరన్ చిత్రంలో బాలీవుడ్, మరాఠీ నటుడు మహేశ్ మంజ్రేకర్ కీలక పాత్రను పోషిస్తున్నారని మోహన్ రాజా చెప్పాడు. ఈ సినిమాలో ఓ కంపెనీ సీఈవో పాత్రను మంజ్రేకర్ పోషిస్తున్నారన్నారు.

  సినిమాలో అనేక మలుపులు

  సినిమాలో అనేక మలుపులు

  వేలైక్కరన్ సినిమాలో మంజ్రేకర్ పాత్ర చాలా విభిన్నమైందని, ఆయన లుక్ కూడా కొత్తగా ఉంటుంది. ఆ పాత్ర అనేక మలుపులు తిరుగుతుంది. ఈ సినిమాలో ఫహద్ పాత్ర చాలా కీలకమైంది.

  మలయాళ నటుడు ఫహద్ గెస్ట్ రోల్

  మలయాళ నటుడు ఫహద్ గెస్ట్ రోల్

  ఇప్పటికే ఫహద్ పాత్ర చిత్రీకరణ పూర్తయింది. సినిమా రెండో భాగంలో ఆయన పాత్ర తెరపైకి వస్తుంది. సినిమాలో ఆయన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని మోహన్ రాజా చెప్పారు.

  సమంత ఫొటో వైరల్

  సమంత ఫొటో వైరల్

  ఈ చిత్రంలో సమంత మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆమె సంబంధించిన సన్నివేశాలను ఈ మధ్య చిత్రీకరించారు. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఆ ఫొటో వైరల్‌గా మారింది. ఫొటోలో సాదాసీదా యువతిగా కనిపించిన సమంత నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నది.

  English summary
  Velaikkaran, director Mohan Raja said that Nayanthara plays a strong character in Velaikkaran while Sivakarthikeyan plays a guy who goes against the protagonist. “Nayanthara plays Mrunalini, her character acts as a huge strength for the hero Sivakarthikeyan, who plays a righteous guy named Arivu,” said Mohan Raja. Bollywood and Marathi actor Mahesh Manjrekar is also a part of the cast and plays a very important role.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more